అనసూయ జబర్దస్త్ మానేయటం వెనుక స్టార్ డైరెక్టర్ హస్తం..?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి తెలియని వారంటూ ఉండరు. గత పది సంవత్సరాలుగా ఈటీవీలో నిర్విఘ్నంగా ప్రసారమవుతున్న ఈ కామెడీ షో ఎంతోమంది కమెడియన్లకు జీవితాన్ని ఇచ్చింది. ఈ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన వారు ఇప్పుడు సినిమాలలో సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. అయితే ఈ షో ద్వారా పాపులర్ అయిన చాలామంది జబర్దస్త్ నుండి బయటకు వెళ్ళారు. ఇంతకాలం జబర్దస్త్ లో సందడి చేసిన వీరందరూ పేరు ప్రఖ్యాతలు రాగానే తమకి జీవితాన్నిచ్చిన షో ని వదిలి వెళ్ళిపోయారు. ఇలా జబర్దస్త్ కి దూరమైన వారిలో యాంకర్ అనసూయ కూడా ఒకరు.

జబర్దస్త్ మొదలైన నాటినుండి అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తోంది. దాదాపు పది సంవత్సరాలుగా జబర్దస్త్ తో అనసూయకి మంచి అనుబంధం ఉంది. ఇలా జబర్దస్త్ ద్వారా యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకుంది. అయితే ఇటీవల సినిమా అవకాశాలు ఎక్కువగా రావటంతో అనసూయ జబర్దస్త్ కి దూరమైంది. అయితే అనసూయ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఒక స్టార్ దర్శకుడు హస్తం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సినిమాలలో ప్రధాన పాత్రలలో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న అనసూయ ఇప్పటికీ బుల్లితెర మీద టీవీ షోలో యాంకరింగ్ చేస్తూ ఉంది. ఇలా టీవీ షోస్ లో యాంకరింగ్ చేయటం వల్ల బుల్లితెర యాంకర్ గా మాత్రమే గుర్తుండిపోతావని, వెండితెర నటిగా గుర్తింపు పొందాలంటే బుల్లితెరకు దూరం కావాలని ఒక స్టార్ దర్శకుడు అనసూయకు హితబోధ చేసినట్లు సమాచారం.

అయితే ఆ దర్శకుడు మాటలను విన్న అనసూయ వెండితెర మీద నటిగా గుర్తింపు పొందటానికి జబర్దస్త్ కు దూరమైంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రంగస్థలం, క్షణం, పుష్ప వంటి సినిమాలలో కీలక పాత్రలలో నటించిన ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తోంది. అంతేకాకుండా ఒక వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ స్క్రీన్ మీద కూడా సందడి చేయనుంది. దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ఒక వెబ్ సిరీస్ లో అనసూయ వేశ్య పాత్రలో నటించనుంది. పది సంవత్సరాలుగా జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగిన అనసూయ ఇటీవల జబర్దస్త్ లాస్ట్ ఎపిసోడ్ సందడి చేసింది. అనసూయ జబర్దస్త్ కి దూరం కావటంతో కొందరు కమెడియన్లతో పాటు ఇంద్రజ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. కానీ అనసూయ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఏ మాత్రం ఎమోషనల్ అవ్వకుండా కనిపించింది.