S.S.Rajamouli: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి సక్సెస్ అందుకున్న రాజమౌళి ప్రస్తుతం వివాదంలో నిలిచారు. ఈయన స్నేహితుడు శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తి సెల్ఫీ వీడియో ద్వారా రాజమౌళి పై ఆరోపణలు చేయడమే కాకుండా రాజమౌళి చేస్తున్న టార్చర్ కారణంగానే తాను ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాను అంటూ ఒక వీడియోని అలాగే ఒక సూసైడ్ లెటర్ కూడా విడుదల చేయడంతో ఒక్కసారిగా ఈ వార్త వైరల్ అవుతుంది.
శాంతినివాసం సీరియల్ కి ముందు నుంచి కూడా రాజమౌళి నాకు మధ్య చాలా మంచి స్నేహం ఏర్పడింది. అయితే మా ఇద్దరి మధ్య ఒక అమ్మాయి చిచ్చు పెట్టిందని తెలిపారు. మేమిద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించామని తెలిపారు. అయితే రాజమౌళి కోసం ఆ అమ్మాయిని త్యాగం చేస్తూ జీవితాంతం నేను సింగిల్గానే ఉండిపోయానని తెలిపారు..
ఇలా రాజమౌళి కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను కానీ అతను మాత్రం నన్ను గత కొద్ది సంవత్సరాలుగా ఎంతో టార్చర్ చేస్తున్నారని ఆయన పెట్టే టార్చర్ నేను భరించలేకపోతున్నాను అంటూ శ్రీనివాసరావు వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. తాను మా ప్రేమ గురించి ఎక్కడ బయట పెడతానోని నన్ను నిత్యం టార్చర్ పెడుతున్నారు. ఆ టార్చర్ భరించలేక తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అంటూ ఈయన ఆ వీడియోలో తెలియచేశారు.
కెరియర్ మొదట్లో రాజమౌళి కోసం నేను నా జీవితాన్నే త్యాగం చేశాను కానీ వాడు ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత నన్ను టార్చర్ చేయడం మొదలుపెట్టారు.నన్ను ఇంతలా ఇబ్బంది పెట్టిన రాజమౌళిని వదిలిపెట్టొద్దని ఆయనపై కేసు నమోదు చేయాలి అంటూ కూడా ఈయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ విషయంలో రాజమౌళికి లై డిటెక్టర్ కూడా పెట్టాలి అంటూ శ్రీనివాసరావు డిమాండ్ చేస్తూ ఒక వీడియోని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇలా రాజమౌళి గురించి ఆయన స్నేహితుడు ఇలాంటి ఒక వీడియోని బయటకు విడుదల చేయడంతో రాజమౌళి వార్తల్లో నిలిచారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే తప్పనిసరిగా ఈ వీడియో పై రాజమౌళి స్పందించాల్సి ఉంది. ఇక శ్రీనివాసరావు రాజమౌళి దర్శకత్వం వహించిన యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా పనిచేశారు.