Mahesh and Prabhas movies : ప్రభాస్, మహేష్ సినిమాలపై అదిరే అప్డేట్స్ ఇచ్చిన స్టార్ కంపోజర్.!

Mahesh and Prabhas movies : ప్రస్తుతం మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర తన మ్యూజిక్ తో అదరగొడుతున్న స్టార్ సంగీత దర్శకుల్లో ఇప్పుడు ఓ రేంజ్ లో హిట్ మీద హిట్ ఇస్తున్న స్టార్ కంపోజర్ థమన్ ఎస్ కూడా ఒకడు. థమన్ ఇప్పుడు ఏ సినిమా చేసిన కూడా బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ని తన సినిమాలకి అందిస్తున్నాడు.
ఎలాంటి హీరోతో చేసినా కూడా అదిరే ఆల్బమ్ ని ఇస్తూ వస్తున్న థమన్ ఇప్పుడు పలు సినిమాలో వేరేగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని కూడా అందిస్తున్నాడు. మరి ఆ చిత్రాల్లో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “రాధే శ్యామ్” కి అందిస్తున్నాడు.
అలాగే ఇంకోపక్క సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేస్తున్న భారీ సినిమా “సర్కారు వారి పాట” కూడా చేస్తున్నాడు. మరి ఈ ఉదయం థమన్ రెండు భారీ సినిమాల పై అదిరే అప్డేట్స్ ని అందించాడు. రాధే శ్యామ్ కి అయితే తాను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటి వరకు ఇచ్చిన వాటిలో బెస్ట్ అని తప్పకుండా చాలా క్రేజీ లెవెల్లో అందరికీ ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది అని.
అలాగే ముందు రోజుల్లో రాధే శ్యామ్ నుంచి మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ రాబోతున్నాయని తెలిపాడు. ఇక మహేష్ సినిమాకి వస్తే ఆల్రెడీ కళావతి సాంగ్ భారీ హిట్ కాగా మరో సాలిడ్ ట్యూన్ రెండో సాంగ్ పై ఈరోజు నుంచే పనులు స్టార్ట్ చేశామని ఇది కూడా అదిరే లెవెల్లోనే ఉంటుంది అని ఈ రెండు సినిమాలపై థమన్ రెండు బిగ్ అప్డేట్స్ ని అందించాడు. మరి ప్రభాస్ సినిమాకి రాధా కృష్ణ దర్శకత్వం అందివ్వగా మహేష్ సినిమాకి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు.