బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ ఆస్తుల విలువ అన్ని కోట్ల రూపాయలా?

బుల్లితెర స్టార్ కమెడియన్లలో ఒకరైన సుడిగాలి సుధీర్ గత పది సంవత్సరాలుగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. సినిమాలలో హీరోగా ఒకవైపు బిజీగా ఉంటూనే మరోవైపు టీవీ షోలతో సుడిగాలి సుధీర్ బిజీ అవుతున్నారు. సుడిగాలి సుధీర్ ఆస్తుల విలువ ఏకంగా 5 కోట్ల రూపాయలు అని సమాచారం. సుడిగాలి సుధీర్ ఏడాదికి 40 నుంచి 50 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారని సమాచారం అందుతోంది.

బ్యాగ్రౌండ్ లేకపోయినా టాలెంట్ తో సుడిగాలి సుధీర్ ఈ స్థాయిలో చేరుకున్నారు. హైదరాబాద్ లో తనకు సొంతంగా రెండు ఇళ్లు ఉన్నాయని సుడిగాలి సుధీర్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో కూడా సుధీర్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కెరీర్ పరంగా సుధీర్ మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

సుడిగాలి సుధీర్ కెరీర్ పరంగా ఎంతో ఎదిగినా ఒదిగి ఉంటారు. ఇతరులను గౌరవించే తక్కువమంది సెలబ్రిటీలలో సుడిగాలి సుధీర్ ఒకరనే సంగతి తెలిసిందే. సుడిగాలి సుధీర్ ప్రస్తుతం మాటీవీ షోలతో, సినిమాలతో బిజీ అయ్యారు. రాబోయే రోజుల్లో సుడిగాలి సుధీర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు సుధీర్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

సుధీర్ రష్మీ కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఆ సినిమా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సుధీర్ రష్మీ ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది. సుధీర్ రష్మీ దారులు షోల పరంగా వేరు అయినా వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం మాత్రం ఉందని సమాచారం అందుతోంది. టాలీవుడ్ సూపర్ స్టార్స్ స్థాయిలో సుడిగాలి సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్నారు. సుధీర్ వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.