హాట్ యాంకర్ అనసూయ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

ఒకే ఛానల్ కు పరిమితం కాకుండా ఒకటి కంటే ఎక్కువ ఛానల్స్ లో యాంకర్ గా చేస్తూ బుల్లితెర యాంకర్ అనసూయ పాపులారిటీని పెంచుకున్నారు. అదే సమయంలో నచ్చిన పాత్రలకు ఓకే చెబుతూ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనసూయ సత్తా చాటుతున్నారు. సాధారణంగా యాంకర్లు సినిమాలలో గ్లామరస్ గా బుల్లితెరపై పద్ధతిగా కనిపిస్తారు. అయితే అనసూయ మాత్రం ఈ విషయంలో రివర్స్ స్ట్రాటెజీని ఫాలో అవుతున్నారు.

ఈ స్టార్ యాంకర్ ఆస్తుల విలువ ఏకంగా 25 కోట్ల రూపాయలు అని సమాచారం. టీవీ షోలకు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు అనసూయ భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నా సినిమాలకు మాత్రం తక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. జబర్దస్త్ షోకు యాంకర్ గా చేయడం వల్లే అనసూయకు ఈ స్థాయిలో క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. అనసూయ సంవత్సరానికి 2 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నారు.

అనసూయకు సొంతంగా ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉండగా ఆ ఇంటి విలువ 7 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని సమాచారం. అనసూయకు రెండు కార్లు ఉండగా ఈ రెండు కార్ల విలువ రెండున్నర కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం అందుతోంది. జబర్దస్త్ షో వల్లే ఆమె ఆస్తులు ఈ స్థాయిలో పెరిగాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఏడాది విడుదలైన ఖిలాడీ సినిమాలో అనసూయ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న పలు సినిమాలలో అనసూయకు కీలక పాత్రలు దక్కాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అనసూయకు మలయాళం, ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. అనసూయ వరుస విజయాలను అందుకుని సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.