Star Actress: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అనే మాట వాస్తవం అయితే ఒకరు కమిట్మెంట్ అడిగినప్పుడు ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా అది మన చేతులలోనే మన వ్యక్తిగత నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఇకపోతే కొంతమంది ఇలాంటి కారణాలవల్ల సినిమా ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉన్నవారు ఉన్నారు.. అలాంటి వారిలో సీనియర్ స్టార్ హీరోయిన్ మల్లికా షెరావత్ కూడ ఒకరు. ఎన్నో సినిమాలలో పెద్ద ఎత్తున బోల్డ్ సన్నివేశాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్న మల్లికా షెరావత్ ఇటీవల కాలంలో సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు.
ఇలా సినిమాలకు దూరంగా ఉన్న ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఇండస్ట్రీలో తనకు అవకాశాలు లేకపోవడం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ చాలామంది హీరోలు నన్ను రాత్రికి కలవమని చెప్పేవారు. అసలు నేనెందుకు వెళ్లి రాత్రిపూట వారిని కలవాలి? సినిమాలలో బోల్డ్ పాత్రలలో నటించినంత మాత్రాన ఆ హీరోలు చెప్పినట్టు నేను వినాలా అంటూ ప్రశ్నించారు.రాత్రి సమయంలో రమ్మని నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పెద్ద హీరోలతో రాజీకి ఒప్పుకోకపోవడంతో ప్రస్తుతం నా చేతిలో సినిమాలు లేకుండా పోయాయి అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.
తెరమీద బోల్డ్ సన్నివేశాలలో నటించినంత మాత్రాన హీరోల ఆలోచనలను నేను ఎప్పటికీ అంగీకరించనని నేను ఆ టైపు కాదు అంటూ ఈ సందర్భంగా మల్లికా షెరావత్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా క్యాస్టింగ్ కౌచ్ కారణంగానే తనకు సినిమా అవకాశాలు లేకుండా పోయాయని అందుకు అంగీకరించకపోవడంతోనే సినిమాలు రాకుండా చేశారు అంటూ ఈ సందర్భంగా మల్లికా షెరావత్ చేసిన ఈ కామెంట్స్ సంచలనమయ్యాయి.
