S.S Thaman: కళావతి అంటూ రెచ్చిపోయి డాన్స్ వేసిన ఎస్.ఎస్.తమన్…. వీడియో వైరల్!

S.S Thaman: పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట.ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 12వ తేదీ విడుదల కావడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ నెల 13వ తేదీ చిత్ర బృందం ఈ సినిమా నుంచి కళావతి అనే పాటను విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.ఇక సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే పాటలకు ఎంతో మంది నెటిజన్లు సినీ సెలబ్రిటీలు డాన్స్ చేస్తూ ఆ డాన్స్ వీడియోలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం మనం చూస్తుంటాము.

ఈ క్రమంలోనే మహేష్ బాబు సినిమాలోని కళావతి పాటకి ఇప్పటికే మహేష్ బాబు కూతురు సితార అలాగే అలాగే శేఖర్ మాస్టర్ కొడుకు కూతురు కూడా ఈ పాటకు డాన్స్ చేస్తూ ఆ డాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక సితార చేసిన ఈ డాన్స్ పెర్ఫార్మెన్స్ కు మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు.ఇలా ఎంతో మంది ఈ పాటకు డాన్స్ వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా తాజాగా కళావతి అంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ అద్భుతమైన స్టెప్పులు వేశారు.

ప్రస్తుతం తమన్ చేసిన ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ కి సంబంధించిన వీడియోను తమన్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు తమన్ పర్ఫామెన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.తమన్ అధిక శరీర బరువు ఉన్నప్పటికీ ఎంతో అద్భుతంగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం తమన్ మల్టీ టాలెంటెడ్ డాన్స్ కుమ్మేసారు అంటూ తమన్ డాన్స్ పర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.