Chiranjeevi: చిరంజీవికి జోడీగా క్రాక్ బ్యూటీ… ఇందులో నిజమెంత?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే పలు చిత్రాలు షూటింగ్ లు జరుపుకోగా మరికొన్ని సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన 154 వ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని షూటింగ్ జరుపుకుంటుంది. ఇలా వరుసగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి ఒక సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నటించడం కోసం కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దర్శకుడు శ్రుతి హాసన్ తో సంప్రదింపులు జరగగా శృతి హాసన్ కూడా చిరంజీవి సినిమాలో నటించడానికి అనుకూలంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఈ ఏడాది క్రాక్ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శృతిహాసన్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఇన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న మరో యాక్షన్ సినిమాలో కూడా శృతి హాసన్ నటిస్తున్న విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా వరుస సినిమాలతో శ్రుతిహాసన్ మరోసారి ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారిపోయారు.