Sruthi Haasan: శాంతను పై ప్రేమ ఎప్పుడు పుట్టిందో చెప్పేసిన శృతిహాసన్… వీడియో వైరల్!

Sruthi Haasan: కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ నిత్యం ఏదో ఒక వార్త ద్వారా సోషల్ మీడియాలో వార్తలలో నిలుస్తున్నారు.ఇలా సోషల్ మీడియా వేదికగా శృతిహాసన్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడం తో అవి కాస్తా వివాదంగా మారుతుంటాయి. అదేవిధంగా ఈమె బాయ్ ఫ్రెండ్స్ గురించి తరచూ ఏదో ఒక వార్త ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. గతంలో శృతిహాసన్ ఇంగ్లాండ్ సింగర్ మైకేల్ కోర్సులే అనే వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారు. త్వరలోనే వీరిద్దరి వివాహం చేసుకోబోతున్నారని, వివాహం తర్వాత శృతి హాసన్ సినిమా ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెబుతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా తనకు శృతిహాసన్ బ్రేకప్ చెప్పింది.

ఈ విధంగా ఇంగ్లాండ్ సింగర్ తో బ్రేకప్ అయిన తర్వాత శృతి హాసన్ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో తెగ రచ్చ చేస్తుంది.ఈ క్రమంలోనే వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారి ప్రేమను వ్యక్తపరుస్తుంది.ఇలా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందనే విషయానికి శృతి హాసన్ ఒక వీడియోని షేర్ చేస్తూ ప్రేమ గురించి బయట పెట్టారు. ఈ వీడియోలో నెటిజెన్స్ అడిగిన ప్రశ్నలకు వీరిద్దరూ సైగల ద్వారా సమాధానాలు తెలియజేశారు. ఈ క్రమంలోనే శృతి హాసన్ తానే మొదటగా ప్రపోస్ చేశాననే విషయాన్ని వెల్లడించారు.

అయితే శృతి హాసన్ శాంతను హజారికాకు ఎక్కడ లవ్ ప్రపోజ్ చేశారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా శృతిహాసన్ వెల్లడించారు. శాంతను గురించి 2018 లో తెలుసుకొన్నాను. అయితే ఆయనని 2020 సంవత్సరం మొదట్లో కలుసుకున్నానని తెలిపారు. మందిరా బేడీ టాక్ షో ‘ద లవ్ లాఫ్ లివ్’లో తొలిసారి శాంతనుతో ప్రేమ విషయం గురించి శ్రుతీ హాసన్ ఓపెన్ అయ్యారనే విషయాన్ని ఈ సందర్భంగా శృతిహాసన్ బయటపెట్టారు. మొత్తానికి శ్రుతి హాసన్ తన ప్రేమ విషయాన్ని ఈ విధంగా బయటపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.