అతి వేగంగా రూమర్స్ స్ప్రెడ్ అయ్యే ఇండస్ట్రీలో సినీ ఇండస్ట్రీ చాలా ముందు ఉంటుంది అని చెప్పాలి సినిమాలతో పాటుగా ఇప్పుడు బుల్లితెర తారలపై కూడా పలు రూమర్స్ బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. మరి అలాగే తాజాగా సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ అయినటువంటి శృతి హాసన్ పై కొన్ని షాకింగ్ రూమర్స్ స్ప్రెడ్ కాగా..
వాటిపై అసలు నిజం ఇప్పుడు బయటకి వచ్చి వైరల్ అవుతుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా ఉన్న శృతి హాసన్ ఆమెకి సడెన్ గా ఆరోగ్యం బాగోక హాస్పిటల్ లో జాయిన్ అయ్యింది అని పలు షాకింగ్ రూమర్స్ వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి.
అయితే వీటిపై శృతి హాసన్ అయితే స్పందించినట్టుగా బయటకి వచ్చింది. తనపై ప్రచారం అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇప్పుడు తాను పర్ఫెక్ట్ గా ఆరోగ్యంగా ఉన్నానని ఒక వీడియో పెట్టి మరీ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. దీనితో ఆ వార్తల్లో అయితే ఎలాంటి నిజం లేదని కన్ఫర్మ్ అయ్యింది.
ఇక ప్రస్తుతం అయితే శృతి హాసన్ తెలుగులో ప్రభాస్ తో సలార్ సహా నట సింహం బాలయ్యతో క్రేజీ మాస్ చిత్రంలో బిజీగా ఉండగా దీనితో పాటుగా మెగాస్టార్ చిరంజీవితో కూడా మరో మాస్ సినిమాలో నటిస్తుంది.
Actress @shrutihaasan slashes out baseless rumours on her health issues and confirms that she is hale and healthy.
Check out her video statement.#ShrutiHaasan pic.twitter.com/YkqXp06Wd7
— Suresh PRO (@SureshPRO_) July 5, 2022