మూగబోయిన శ్రీవాణి గొంతు.. ఆమె పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్న హరిత!

ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఎంతోమంది సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకొని సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా బుల్లితెర నటీమణులు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.ఇక వారింటికి సంబంధించి ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసిన కూడా ఆ వస్తువు గురించి చెప్పడం ఇంట్లో ఫ్రిడ్జ్ టూర్, కిచెన్ టూర్, బాల్కనీ టూర్ అంటూ ప్రతి ఒక్కరూ ఈ వీడియోలతో వారి వ్యక్తిగత జీవితం గురించి అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే బుల్లితెర నటి శ్రీ వాణి గత కొంతకాలం నుంచి గొంతు సమస్యతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె నెల రోజులపాటు మాట్లాడకూడదని డాక్టర్లు సూచించినప్పటికీ ఈమె వీడియోలు చేయడం మాత్రం ఆపడం లేదు. మూగ సైగలతోనే వీడియో చేస్తూ భారీగానే సంపాదిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా బుల్లితెర నటి హరిత వారింట్లో వరలక్ష్మి వ్రతం చేయడంతో బుల్లితెర నటీమణులను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే శ్రీవాణి సైతం వరలక్ష్మి వ్రతానికి తన కూతురు నందినితో కలిసి వెళ్లింది.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ వాణిని చూడగానే హరిత ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయింది. గలగల మాట్లాడే శ్రీ వాణి గొంతు ఇలా మూగబోవడంతో ఆమె ఒక్కసారిగా ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా హరిత కన్నీళ్లు పెట్టుకోవడంతో శ్రీవాణి సైగల తోనే తను చాలా బాగున్నానని ఏడవద్దు అంటూ చెప్పారు. ఆమె ఎంత చెబుతున్నప్పటికీ హరిత మాత్రం తన ఎమోషన్ ను కంట్రోల్ చేసుకోలేకపోయింది.ఇక అదే సమయంలో అక్కడికి వచ్చిన ఉదయభాను సైతం ఈ విషయం తెలుసుకొని కాస్త ఎమోషనల్ అయ్యారు. అయితే నెల రోజులపాటు శ్రీవాణి మాట్లాడకుండా ఉంటేనే తను ఎప్పటిలాగే మాట్లాడగలదని డాక్టర్లు సూచించడంతో శ్రీవాణి మాట్లాడకుండా ఉన్నారు.