Srivalli Song: సరికొత్త రికార్డును సాధించిన శ్రీవల్లీ సాంగ్..?

Srivalli Song: Srivalli song: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా డిసెంబర్ 17 న భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవల్ లో విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదల అయి సూపర్ హిట్ అవడమే కాకుండా,బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఈ సినిమాలోని పాటలు ఏ ముహూర్తాన విడుదలయ్యాయో కానీ యూట్యూబ్ లో సోషల్ మీడియాలో అరుదైన ఘనతను సాదిస్తున్నాయి. ఇకపోతే వంద మిలియన్ ల వ్యూస్ అనేది ఈమద్య కాలంలో చాలా కామన్ విషయంగా మారిపోయింది.

ఇక యూట్యూబ్ లో తెలుగు సినిమాల పాటలు వంద మిలియన్ వ్యూస్ ను దక్కించుకోవడం చాలా చిన్న విషయంగా భావిస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలో పుష్ప సినీమాలో శ్రీవల్లి పాట వంద మిలియన్ వ్యూస్ ను దక్కించుకోవడం అత్యంత అరుదైన రికార్డుగా నమోదు అయ్యింది. శ్రీవల్లి తెలుగు వర్షన్ ఇప్పటికే 130 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుంది. ఆ విషయం పెద్ద రికార్డ్ కాదు. శ్రీవల్లి హిందీ వర్షన్ సాంగ్ ఏకంగా వంద మిలియన్ వ్యూస్ ను దక్కించుకోవడం అరుదైన రికార్డ్ అని చెప్పవచ్చు.

ఒక తెలుగు పాట లేదా మరేదైనా సౌత్ ఇండియన్ సినిమాలలో పాట హిందీలో డబ్ అయ్యి దానికి వంద మిలియన్ ల వ్యూస్ రావడం అన్నది అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు. ఇలాంటి అరుదైన రికార్డును శ్రీవల్లి దక్కించుకోవడంతో అభిమానులు అల్లు అర్జున్ పుష్ప సినిమా స్థాయిని మరోసారి సోషల్ మీడియాలో ఆకాశమే హద్దు అన్నట్లుగా ఎత్తేస్తున్నారు. ఇక పుష్ప సినిమా విడుదల అయ్యి నెల రోజులు దాటినా కూడా పుష్ప సినిమా క్రేజ్ తగ్గలేదు.