Rashmika : డీ గ్లామర్ రోల్స్ క్రియేట్ చేయడంలో సుకుమార్ అందె వేసిన చేయి. నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్ అనే రేంజులో ముద్దుగుమ్మల్ని తన సినిమా కోసం మేకోవర్ చేస్తుంటాడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. ఎంతైనా లెక్కల మాస్టారు కదా.. ఆయన చేసేదానికి ఓ లెక్కుంటుంది.
అందుకే అందాల భామలు తమ అందాల్ని సైతం పక్కన పెట్టేసి, అమాయకత్వం నిండిన పల్లెటూరి ముద్దుగుమ్మల్లా నేచురల్ లుక్స్‌లోకి మారిపోతుంటారు. ఇప్పుడీ ముచ్చట ఎందుకంటారా.? ‘రంగస్థలం’ సినిమా కోసం సమంతను రామలక్ష్మిగా మార్చేశాడు డైరెక్టర్ సుకుమార్. ఆ పాత్ర సమంతకు ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో వేరే చెప్పక్కర్లేదు.
తాజాగా సుకుమార్ సృష్టించిన అందమైన శిల్పం శ్రీవల్లి. ‘పుష్ప’ సినిమా కోసం సుకుమార్ సృష్టించిన డీ గ్లామర్ బొమ్మ ఈ శ్రీవల్లి. ఈ పాత్ర రష్మిక మండన్నాని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. నటిగా అనూహ్యమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించింది రష్మిక ఈ పాత్రతో.
సరే, అంతా బాగానే వుంది. కానీ, ఇలాంటి పాత్రే మళ్లీ రష్మిక దగ్గరకొచ్చిందట తాజాగా. అయితే, రష్మిక సింపుల్‌గా నో చెప్పేసిందట. సుకుమార్ సినిమా కాబట్టి ఓకే చేశాను.. ఇంకే సినిమా అయినా ఓకే చేసే ప్రశక్తే లేదని తెగేసి చెప్పేసిందట.
ఇంతకీ ఏంటా సినిమా.? అంటే ఆ వివరాలు పూర్తిగా తెలియవు కానీ, ఓ కొత్త డైరెక్టర్, ప్రముఖ బ్యానర్‌లో రూపొందించబోయే సినిమా అట ఇది. నిజంగానే రష్మిక ఆ ప్రాజెక్టుకు నో చెప్పిందా.? ఏమో చెప్పినా చెప్పేసుంటుంది. ప్రస్తుతం రష్మిక తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు క్రేజీ అండ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో బిజీగా వున్న సంగతి తెలిసిందేగా.!