శ్రీముఖి ఏ షో చేసినా రచ్చ రచ్చే. చాలామందికి శ్రీముఖిది ఓవర్ ఆక్షన్ అని అనిపించినా అలాంటి యాంకరింగ్ నచ్చే వాళ్ళు చాల మంది వున్నారు అలాగే శ్రీముఖి కి చాల మంది అభిమానులున్నారు.
చాల షో లతో బిజీగా వుండే శ్రీముఖి ప్రస్తుతం చేస్తున్న షోలలో జీ తెలుగు వారి “సరిగామప” మంచి ప్రేక్షకాధరణతో ముందుకు వెళుతుంది. యువ గాయని గాయకుల ప్రతిభని బయటకు తీసుకురావడంలో ఈ షో ఎంతో ఉపోయోగపడుతుంది.
ప్రముఖ సంగీత దర్శకులు కోఠి, గాయని ఎస్పీ శైలజ మరియు గేయ రచయిత చంద్ర బోస్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఈ షో కి శ్రీముఖి మరియు ప్రదీప్ మాచిరాజు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ వారం వచ్చిన ప్రమోలో శ్రీముఖి ఒక పాట పాడగా కోఠి ఆమెని అభినందిస్తూ ” నువ్వే గాని ప్రాక్టీస్ చేసి పాడితే నీ ముందర సింగెర్స్ ఎవరు నిలబడలేరు చంద్రముఖి” అని మళ్లీ తనని తాను కరెక్ట్ చేసుకొని శ్రీముఖి అని అన్నారు కోఠి.
అయితే ఆ పాటను కొనసాఇస్తూ శ్రీముఖి చంద్రబోస్ ని చూస్తూ “ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని” అని పాడగా చంద్ర బోస్ వద్దు వద్దు అని చేతులూపి సైగలు చేయడంతో నవ్వులు విరిశాయి.
ఎంతో మంది యువ గాయని గాయకులకు ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని అందు చూసి ఆదరించాలని తెలుగురాజ్యం కోరుకుంటుంది.