శ్రీముఖి వ్యక్తిత్వం అలాంటిదే.. శ్రీముఖి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఇమ్మానియేల్!

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు కమెడియన్ ఇమ్మానియేల్. ఈయన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంట్రీ ఇచ్చి అనంతరం ఈ కార్యక్రమంలో వర్షతో కలసి అద్భుతమైన స్కిట్ లను చేస్తూ తన పెర్ఫార్మెన్స్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఇమ్మానియేల్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఒకానొక సమయంలో వర్ష, ఇమ్మానియేల్ జోడి సుడిగాలి సుదీర్ జోడికి పోటీగా వచ్చారని, సుధీర్ కన్నా విశేషమైన గుర్తింపు పొందారని వార్తలు కూడా వచ్చాయి.

ఈ విధంగా ఇమ్మానియేల్ వర్ష ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఏదో ట్రాక్ నడుస్తోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తమ మధ్య ఎలాంటి ట్రాక్లు లేవని కొట్టిపారేశారు.ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇమ్మానియేల్ శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే స్పెషల్ ఈవెంట్ లో కూడా సందడి చేస్తున్నారు.ఇలా తన కార్యక్రమాలతో బిజీగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఇమ్మానియేల్ ఎంతో బిజీగా ఉంటారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే నెటిజన్ శ్రీముఖి గురించి ఇమ్మానుయేల్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా శ్రీముఖి గురించి ఇమ్మానుయేల్ మాట్లాడుతూ శ్రీముఖి మంచితనం, అందరిని కలుపుకొని వ్యక్తిత్వం తనది అంటూ శ్రీముఖి గురించి చెబుతూనే స్వీట్ సిస్టర్ అంటూ కామెంట్ చేశారు.ఈ విధంగా ఇమ్మానియేల్ శ్రీముఖి గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.