Sreemukhi: యశ్ మాస్టర్ తో రొమాంటిక్ డాన్సు చేసిన శ్రీముఖి.. యశ్ భార్య రియాక్షన్ ఇదే?

Sreemukhi: బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్ శ్రీముఖి కూడా ఒకరు. అదుర్స్ షో ద్వారా అంతర్గత ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీముఖి పలు టివి షోలకు యాంకర్ గా వ్యవహరించింది. శ్రీముఖి తన అందంతో పాటు చిలిపి చేస్టలతో యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది. శ్రీముఖి ఎక్కడ ఉంటే ఆ ప్రాంతం ఎంతో సందడిగా ఉంటుంది. శ్రీముఖి యాంకర్ గా మాత్రమే కాకుండా పలు సినిమాలలో కూడా నటించింది. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో నటించిన శ్రీముఖి తర్వాత నేను శైలజ అనే సినిమాలో కూడా రామ్ కి చెల్లెలి పాత్రలో నటించింది.

ప్రస్తుతం శ్రీముఖి సరిగమప సింగింగ్ షో కి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల జీ తెలుగులో ప్రసారమవనున్న 17వ యానివర్సరీ సెలబ్రేషన్స్ కి యాంకరింగ్ చేసింది. ఈ కార్యక్రమంలో జీ ఛానల్ లో నటించే ఆర్టిస్టులందరూ పాల్గోని తమ డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఫుల్ హంగామా చేశారు. ఈ క్రమంలో ఆర్టిస్టులు అందరితోపాటు శ్రీముఖి కూడా ఆటపాటలతో అందరినీ మెప్పించింది. ఈ క్రమంలో శ్రీముఖి డాన్స్ మాస్టర్ యశ్ తో కలిసి రొమాంటిక్ పాటకి స్టేప్పులేసింది. ఢీ షో యశ్ మంచి గుర్తింపు పొందాడు. ప్రస్తుతం యశ్ సినిమాలో కొరియోగ్రాఫర్ గా చలామణి అవుతున్నాడు.

శ్రీముఖి యశ్ మా స్టర్ తో కలసి రొమాంటిక్ స్టెప్పులు వేయటంతో యశ్ మాష్టర్ భార్య స్టేజి మీదకి వచ్చి వారిద్దరిని చాలా కోపంగా చూస్తూ సీరియస్ అయ్యింది. అప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యాక్టర్ అకుల్ మాట్లాడుతూ..చెల్లెమ్మ మీ ఆయన నిప్పు తను ఎక్కడున్నా భస్మం అయిపోతాడు అని అంటాడు. తర్వత ఒకసారి నోట్లో వేలు పెట్టి చుడు అని ఆకుల్ అంటే..అమ్మో కొరికేస్తాడు అని యశ్ భార్య అంటుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.