Film News: బాలకృష్ణను పొగడ్తలతో ముంచేసిన శ్రీ రెడ్డి…. ఎందుకంటే?

Film News: తెలుగు ఇండస్ట్రీలో శ్రీ రెడ్డి అందరికీ చాలా సుపరిచితమైన వ్యక్తి. ఆమె పేరు తెలియని వారంటూ ఉండరు. ఎల్లప్పుడూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ తరుచు వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. అలాంటి శ్రీరెడ్డి ఎవరినైనా పొగిడిన అంటే నమ్మశక్యం కలగదు. శ్రీ రెడ్డి ఇ తన యూట్యూబ్ ఛానల్ లో ప్రతి రోజు ఏదో ఒక విషయం పై వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. రాజకీయాలు సినిమాలు అంటూ దేనిని వదలకుండా అందరిపై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా శ్రీ రెడ్డి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా బాలకృష్ణపై సంచలన కామెంట్స్ చేసింది.

అఖండ సినిమా ద్వారా ఘన విజయం సొంతం చేసుకున్న బాలకృష్ణ అటు ఆహా లో స్ట్రీమ్ అవుతున్న “ఆన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె” టాక్ షో ద్వారా హోస్ట్ గా బాగా పాపులర్ అయ్యాడు. బాలకృష్ణ నటుడిగా మాత్రమే కాకుండా, ఇప్పుడు వ్యాఖ్యాతగా కూడా తన సత్తా చాటుతున్నాడు. అయితే తాజాగా శ్రీరెడ్డి బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించింది. శ్రీ రెడ్డి పోస్ట్ చేసిన ఈ వీడియోలో బాలకృష్ణ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బాలయ్య సినిమా చేస్తే ఎవరికైనా పూనకాలే అంటూ ఈ వీడియోకు టైటిల్ సెట్ చేసింది. తాజాగా విడుదలైన అఖండ సినిమా గురించి, అందులో బాలకృష్ణ గారు చెప్పిన డైలాగ్స్ గురించి శ్రీ రెడ్డి మాట్లాడారు. అలాంటి డైలాగులు అందంగా, భయంకరంగా చెప్పాలంటే ఒక బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యమని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి చెప్పుకొచ్చారు.

నందమూరి తారక రామారావు గారి ముద్దుల కొడుకు బాలకృష్ణ అంటూ శ్రీ రెడ్డి కామెంట్స్ చేసింది. బాలకృష్ణ నటుడిగా, వ్యాఖ్యాతగా, రాజకీయ నాయకుడిగా ఎంతో సక్సెస్ ఫుల్ పర్సనల్ గా కొనసాగుతున్నారు. కరోనా పాండమిక్ టైం లో అఖండ సినిమా విడుదలై 50 రోజులలో రెండు వందల కోట్ల రూపాయల కలెక్షన్ మూటగట్టుకుంది. ఆ క్రెడిట్ మొత్తం బాలకృష్ణ గారికి దక్కుతుందని ప్రశంసల వర్షం కురిపించింది. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న రికార్డులు కూడా ఎవరు క్రాస్ చేయలేరు అంటు బాలకృష్ణను పొగడ్తలతో ముంచేసింది.