Sri Reddy : చీరకట్టుతో సెల్ఫికి ఫోజులిచ్చిన శ్రీ రెడ్డి.. మాస్ క్యాప్షన్ తో ఫోటో షేర్ చేస్తూ..!

Sri Reddy: అనునిత్యం వివాదాలలో తల దూరుస్తూ అందరి మీద విరుచుకు పడే శ్రీ రెడ్డి వివాదాస్పద నటిగా గుర్తింపు పొందారు. ఇటు సినిమా ఇండస్ట్రీ వారిని, అటు రాజకీయ నాయకులను ఎవరిని వదలకుండా తనదైన రీతిలో విమర్శిస్తూ దారుణమైన కామెంట్స్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీ రెడ్డి తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తోంది. ఇటీవల ఈ అమ్మడు కొంచం శాంత పడినట్టు ఉంది. సోషియల్ మీడియా వేదికగా ఎవరి జోలికి వెళ్లకుండా రూటు మార్చి వంటలక్కగా అవతారం ఎత్తింది. సొంత యూట్యూబ్ ఛానల్ కలిగి ఉన్న శ్రీ రెడ్డి తన ఛానల్ ద్వారా ఈ మధ్య వంటల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

ఆ వంటలు తయారు చేసే క్రమంలో కూడ శ్రీ రెడ్డి తన అందాలను విందుగా ఉంచి వడ్డిస్తోంది. ఈ మధ్య కాలంలో ఎక్కడా గొడవల్లో తలదూర్చని శ్రీ రెడ్డి ఇటీవల తన ఫోటో షేర్ చేస్తూ ఒక మాస్ క్యాప్షన్ పెట్టింది. ఆ ఫోటోలో శ్రీ రెడ్డి తెలుగుతనం ఉట్టిపడేలా చీరకట్టులో ఉంది. చీర కట్టులో ఉన్న శ్రీ రెడ్డీ సెల్ఫీ కి ఫోజులిచ్చింది. ఇటీవల ఈ అమ్మడు ఆ సెల్ఫీని షేర్ చేస్తూ లేట్ అయినా తాట తీయడం నా తర్వాతే ఎవరైనా ఆన్ ది వే అంటూ క్యాప్షన్ పెట్టింది.

ఈ పోస్టు చూసిన నెటిజన్లు ఈ రోజు శ్రీ రెడ్డీ చేతిలో ఎవడికో మూడింది. ఎవరో ఆ దురదృష్టవంతుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇలా శ్రీరెడ్డి తాట తీయడానికి వస్తున్నా అని చెప్పడంతో నిజంగానే ఈవిడ ఎవరికో గట్టి వార్నింగ్ ఇవ్వడానికి బయలుదేరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి శ్రీరెడ్డి ఎవరి తాట తీయనుందో తెలియాల్సి ఉంది.