Ram Gopal Varma : సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత రెండు మూడు రోజుల నుంచి ఏపీ ప్రభుత్వం టికెట్ల విషయంలో తీసుకున్న నిర్ణయంపై తనదైన శైలిలో స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇలా ఏపీ ప్రభుత్వం పై వర్మ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు సైతం స్పందిస్తూ తమదైన శైలిలో వర్మకు కౌంటర్ ఇచ్చారు. ఇలా ఏపీ ప్రభుత్వానికి వర్మకు మధ్య ట్వీట్ల యుద్ధం నడిచిందని చెప్పాలి .ఇలా వీరిద్దరి మధ్య పెద్దఎత్తున పోరు జరుగుతున్న నేపథ్యంలో ఏపీ మంత్రి వర్మకు అపాయింట్మెంట్ ఇచ్చి తనని కలవాలని చెప్పడంతో ఈ వివాదం అక్కడితో ముగిసింది.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై సంచలనాత్మక నటి శ్రీరెడ్డి స్పందించారు. ఈ విషయంలోకి శ్రీరెడ్డి ఎంటర్ అవడంతో మరో సారి వర్మ రెచ్చిపోయే సూచనలు కనబడుతున్నాయి.ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వాన్ని విమర్శల పాలు చేసిన రామ్ గోపాల్ వర్మ పై శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే శ్రీ రెడ్డి ఈ విషయం గురించి మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో ఉండే ఈయనకు ప్రస్తుతం థియేటర్ల విషయం కావాల్సి వచ్చిందా అని ప్రశ్నించారు.
బాలీవుడ్ ఇండస్ట్రీ చీ కొడితే ఇక్కడికి వచ్చావు. ఇక్కడ ప్రతి ఒక్కరి విషయంలో వేలు పెట్టి పెద్ద వివాదాన్ని క్రియేట్ చేస్తూ ఉంటావు. బ్లూ ఫిలిమ్స్ తీయడం, బి గ్రేడ్, సీక్రెట్ అమ్మాయిలనీ వల్లో కూర్చోబెట్టుకొని వారి గురించి కామెంట్లు చేయడమేపనిగా పెట్టుకున్నావు అలాంటి నువ్వు టికెట్ల వ్యవహారం పై జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సరికాదు. నువ్వు ఎలాగైనా ఉండు కానీ జగన్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టకు. జగన్ ని ఏమైనా అనాలంటే ముందుగా నన్ను దాటుకుని వెళ్ళాల్సి ఉంటుందని శ్రీరెడ్డి వర్మ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.