Sri rapaka : వర్మ కంపెనీ నుంచి దిగుమతి అయిన ముద్దుగుమ్మ శ్రీ రాపాక. అదేనండీ ‘నగ్నం’ సినిమాతో అప్పట్లో తెగ రచ్చ రచ్చ చేసింది కదా.. ఆవిడే ఈవిడ. రీసెంటుగా ఓటీటీలో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ పేరుతో స్ర్టీమింగ్ అవుతోన్న రియాల్టీ షోలోనూ అమ్మడు సందడి చేసింది.
హౌస్‌లో వున్నది రెండే వారాలయినా తన అందాలతో బిగ్‌బాస్ షోకి కావల్సినంత అడల్ట్ కంటెంట్ ఇవ్వడంలో బాగానే సక్సెస్ అయ్యింది. ఏమైందో ఏమో కానీ, రెండో వారమే ఈ హాట్ బేబీని హౌస్ నుంచి బయటికి పంపేశారనుకోండి.
హౌస్‌లో వున్నప్పుడు ఓ రకంగా, బయటికి వచ్చాకా మరో రకంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్లు హల్చల్ చేయడం తెలిసిన సంగతే. ఆ క్రమంలోనే హౌస్ నుంచి బయటికొచ్చిన శ్రీ రాపాక ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ గతంలో కన్నా ఎక్కువగా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
అలా మీడియా జనాలు అడిగిన ప్రశ్నల్లో ఆమె లవ్ స్టోరీ ఒకటి బయటికొచ్చింది క్రేజీగా. ఈ హాట్ బేబ్ ఓ మ్యూజిక్ డైరెక్టర్ని లవ్ చేసిందట. సేమ్ ఇండస్ర్టీలో వుండడం వల్ల పొసెసివ్‌నెస్ కారణంగా వీరిద్దరి మధ్యా గ్యాప్ వచ్చి బ్రేకప్ చేసుకున్నారట.. ఈ ముచ్చట చెబుతూనే తనక్కాబోయే భర్త ఎలా వుండాలో కూడా చెప్పుకొచ్చింది.
‘సేమ్ ఇండస్ర్టీ’ అనే పదం వాడిందంటే, పాపకి సేమ్ ఇండస్ర్టీ వరుడ్ని వరించే యోచన లేనట్లుంది పాపం. ఏమైతేనేం, తనక్కాబోయే భర్త పట్ల ఓ క్లారిటీ వుందిలెండి అమ్మడికి. తనను డామినేట్ చేసేవాడే తనకు భర్తగా రావాలని అంటోంది. ఏందిది విచిత్రంగా లేదూ.! రాపాక మాటకు అర్ధమే వేరులే అనుకోవాలేమో.