సిద్ధూ జొన్నలగడ్డకి హ్యాండిచ్చిన శ్రీ లీల

అప్పుడెప్పుడో వచ్చిన నాగ చైతన్య మొదటి సినిమా ‘జోష్’ లో ఒక చిన్న రోల్ లో కనిపించదు సింధు జొన్నలగడ్డ. నటుడిగా, రచయితగా తన టాలెంట్ నిరూపించుకున్నా కానీ సరైన గుర్తింపు రాలేదు.

‘గుంటూరు టాకీస్’, ‘కృష్ణ అండ్ హిస్ లీల’ సినిమాలతో కొంచెం గుర్తింపు తీసుకున్న సిద్ధూ కి
‘డి జె టిల్లు’ సినిమాతో క్రేజ్ వచ్చింది.  తక్కువ బడ్జెట్‌తో రూపొంది ఊహించని విధంగా భారీ కలెక్షన్లని సాధించింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌పై అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమాలో ‘పెళ్లి సందడి’ సినిమాతో పరిచయమైన శ్రీ లీల ని హీరోయిన్ గా ఎంచుకున్నారు. ఆమె ఓకే చెప్పడమే కాదు, ఏకంగా షూటింగ్‌ వరకు వెళ్లిందట. కానీ ఊహించని విధంగా `డీజే టిల్లు 2` నుంచి శ్రీ లీల తప్పుకుందని తెలుస్తుంది.

కారణాలు తెలియనప్పటికీ షూటింగ్‌ స్టార్ట్ అయిన రెండు రోజులకే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రవి తేజ ‘ధమాకా’ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంది శ్రీ లీల.

అలాగే గాలి జనార్థన్‌రెడ్డి కొడుకు  కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న సినిమాలోనూ హీరోయిన్‌గా సెలెక్ట్ అయిందని  సమాచారం. అంతే కాకుండా  ప్రభాస్‌తో మారుతి చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఓ కథానాయికగా నటించబోతుందని సమాచారం.