Sreemukhi: తన పుట్టినరోజు సందర్భంగా మెహర్ రమేష్ పోస్ట్ పై స్పందించిన శ్రీముఖి..!

Sreemukhi: ఇండస్ట్రీలో బుల్లితెర మీద కొనసాగుతున్న యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు. ఎన్నో టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించిన శ్రీముఖి తన అందంతో, చిలిపి పనులతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. శ్రీముఖి యాంకర్ గా మాత్రమే కాకుండా పలు సినిమాలలో నటించి నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది. జులాయి సినిమాలో హీరో అల్లు అర్జున్ కి చెల్లెలు క్యారెక్టర్ చేసిన శ్రీముఖి అప్పటినుండి పలు సినిమాలలో నటించింది. ప్రస్తుతం చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న భోలా శంకర్ సినిమాలో కూడా శ్రీముఖి నటిస్తోంది.

ఇదిలా ఉండగా ఈ ముద్దుగుమ్మ ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది. తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్న శ్రీముఖి ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలతో పాటు ఆమె అభిమానులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ త్రీ లో పాటిస్పేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆ సమయంలో గ్రాండ్ ఫినాలే కు గెస్ట్ గా వచ్చిన చిరంజీవి తన సినిమాలో శ్రీముఖికి అవకాశం ఇస్తానని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.

అందువల్ల ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో శ్రీముఖి అవకాశం ఇచ్చారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా శ్రీముఖి మెహర్ రమేష్ గారితో పరిచయం ఏర్పడింది. శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా మెహర్ రమేష్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. శ్రీముఖి ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ వైబ్స్ ఉంటాయని పోస్ట్ చేశాడు. మెహర్ రమేష్ పోస్ట్ కి స్పందించిన శ్రీముఖి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది.