వేదికపై అందరూ చూస్తుండగానే హీరోకు ముద్దు పెట్టిన శ్రీముఖి… వైరల్ అవుతున్న ఫోటో?

బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి ముందు వరుసలో ఉంటాయి. ఈ క్రమంలోనే ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు తప్పకుండా ఆ రోజుకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేస్తుంటారు. అయితే త్వరలోనే రాఖీ పౌర్ణమి రానున్న సందర్భంగా ఈటీవీ వారు హలో బ్రదర్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో సందడి చేసే సెలబ్రిటీలు తమ అన్నయ్య తమ్ముళ్లకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ కార్యక్రమానికి బుల్లితెర రాములమ్మ శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించారు. ఇకపోతే తాజాగా విడుదలైన ప్రోమోలో భాగంగా శ్రీముఖి హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ తో కలిసి పెద్ద ఎత్తున రచ్చ చేశారు.ఈ సందర్భంగా వారిద్దరిని వేదికపైకి ఆహ్వానించిన శ్రీముఖి వారిద్దరికీ ఒక టాస్క్ ఇచ్చింది. తాను ప్లే చేసే పాటలో ఉన్న వస్తువులను ఒక్కొక్కటిగా తెచ్చి తనకి ఇవ్వాలని తెలిపారు. ఈ క్రమంలోనే శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఆకలేస్తే అన్నం పెడతా అనే పాటను ప్లే చేశారు.

ఈ పాట ప్లే అవ్వగానే హైపర్ ఆది అన్నం ఆయిల్ కోసం పరుగులు తీయగా రాంప్రసాద్ మాత్రం శ్రీముఖికి ముద్దులు పెడుతూ ఉన్నారు. ఈ పాటలో మూడోస్తే ముద్దులు పెడతా అని లైన్ ఉండడంతో ఏకంగా హైపర్ ఆది రాంప్రసాద్ ఇద్దరు తనకు ముద్దులు పెట్టారు. అయితే వీరిద్దరూ శ్రీముఖి బుగ్గపై కాకుండా తన చేతిలో ముద్దులు పెట్టారు.ఇలా ఇద్దరు ఒక్కసారిగా శ్రీముఖిపై ముద్దుల వర్షం కురిపించడంతో అక్కడున్న వారికి ఏమీ అర్థం కాలేదు. తర్వాత హైపర్ ఆది వారిద్దరు ఎందుకు ముద్దులు పెట్టారో వివరించారు.ఇలా వీరిద్దరూ శ్రీముఖికి ముద్దులు పెట్టడంతో శ్రీముఖి మాత్రం ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన నవీన్ చంద్ర బుగ్గపై ముద్దు పెట్టింది. ఇలా శ్రీముఖి హీరోకి ముద్దు పెట్టడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.