Sonu Sood: బాలయ్య బాటలో పయనిస్తున్న సోనూసూద్… ఆ కార్యక్రమానికి హోస్ట్ గా రియల్ హీరో!

Sonu Sood: కరోనా కష్టకాలంలో ఎంతోమందిని ఆదుకొని నిజజీవితంలోరియల్ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు సోనుసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటుడిగా మాత్రమే కాకుండా సాటి మనిషిగా ఎంతో మందికి సహాయ సహకారం చేస్తూ అందరి మన్ననలు పొందారు. ఈ విధంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సోనుసూద్ వరుస సినిమాలు, కమర్షియల్ యాడ్స్ ద్వారా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సోనూసూద్ ఒక టీవీ షోకి హోస్ట్ గా మారనున్నారు.

ఈ సందర్భంగా ఈ విషయాన్ని సోను సూద్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ త్వరలో మీ అందరికీ ఫన్, మస్తీ అందించేందుకు అడ్వెంచరస్ షోతో మీ ముందుకు రావడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నా జీవితంలో రోడీస్ కొత్త సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నా.. నా జీవితంలో ఇదో కొత్త అడ్వెంచర్ అని సోను సూద్ ఒక వీడియోని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నటుడిగా ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఎంతోమంది ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్న సోనుసూద్ ఒక టీవీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఏ విధంగా ప్రేక్షకులను మెప్పిస్తారొనని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియోలో భాగంగా ఆయన రోడ్ పక్కనున్న షాప్‌లో సమోసాలు కూడా తిన్నారు.అయితే ఇప్పటికీ ఈ రియాలిటీ షో షూటింగ్ ప్రారంభం కాగా మార్చి మొదటి వారం నుంచి ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సోను సూద్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.