Sonu Sood: పోకిరి సినిమాలో మొదట హీరోగా..ఆ విలన్ ని తీసుకుందాం అనుకున్నారట?

Sonu Sood: సోనూసూద్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కరోనా మహమ్మారి ఇలాంటి విపత్కర సమయాల్లో ఎంతోమందిని ఆదుకుని వారిని వారి వారి గమ్యస్థానాలకు చేర్చిన వ్యక్తి సోనుసూద్. కరోనా సమయంలో ఎక్కువగా రెండు పేర్లు వినిపించాయి. అందులో ఒకటి కరోనా పేరు కాగా మరొకటి సోనూసూద్ పేరు. కరోనా సమయంలో ఆపద అనగానే సోను సూద్ గుర్తుకు వచ్చే విధంగా సోను సూద్ మారిపోయారు. కరోనా సమయంలో ఎక్కడ ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే సోనూసూద్ కి ఫోన్ చేయడం పరిపాటిగా మారిపోయింది అంటే అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే సినిమాల్లో విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్ రియల్ లైఫ్ లో మాత్రం హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతో మంది ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు. ఇప్పుడు సోను సూద్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.. సోను సూద్ మొదటిగా 1999లో తమిళం లో రిలీజ్ అయిన కల్లాజగార్ సినిమాతో సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో సోనూసూద్ విలన్ పాత్రలో నటించాడు. ఇక ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సోనూసూద్ నటించిన సూపర్ సినిమాతో సోనూసూద్ కు మరింత క్రేజ్ వచ్చింది.

ఇక అరుంధతి సినిమాలో పశుపతి క్యారెక్టర్ సూనూసూద్ కీ మరింత పాపులారిటీ సంపాదించిపెట్టింది. ఇప్పటికీ ఈ క్యారెక్టర్ చాలా ఫేమస్. ఇకపోతే మహేష్ బాబు కెరీర్లో బెస్ట్ సినిమాగా నిలిచిన పోకిరి సినిమా గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోగా మొదట మహేష్ బాబుని కాకుండా సోనూసూద్ ని సంప్రదించారట. అయితే సోనూసూద్ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను చేయలేకపోయారు. ఒకవేళ ఆ సినిమానే సోను సూద్ చేసి ఉంటే, ఈ పాటికి సోనూసూద్ ఒక స్టార్ హీరో రేంజ్ కు ఎదిగేవారు.