Sonu Sood: ప్రమాదంలో పడిన యువకుడిని కాపాడి మరోసారి మంచి మనసున్న చాటుకున్న సోనుసూద్… వీడియో వైరల్!

Sonu Sood: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలలో విలన్ గా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సోనూ సూద్ తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలను పోషించి విశేషమైన ప్రేక్షకాదరణ పొందారు.అయితే సోనుసూద్ సినిమాలో విలన్ పాత్రలో నటించిన నిజ జీవితంలో మాత్రం ఆయన హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ విధంగా కరోనా మహమ్మారి సమయంలో ఎంతో మందిని ఆదుకొని సహాయ సహకారాలు చేసిన సోనుసూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా ఆపదలో ఉన్న వారికి సహాయ సహకారాలు చేస్తూ అందరి మదిలో దేవుడిగా మారిపోయారు.

ఇదిలా ఉండగా సోను సూద్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. పంజాబ్‌లోని మోగా నగరంలోని కొట్కాపురా బైపాస్ సమీపంలో సోమవారం అర్థరాత్రి దాటాక రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ 19 ఏళ్ల యువకుడు ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో భాగంగా ఆ యువకుడు డ్రైవింగ్ సీట్లో ప్రమాదానికి గురైన ఘటన సోనుసూద్ కంటపడింది. ఈ క్రమంలోనే తన కారు ఆపి తన టీమ్ తో కలిసి సోనుసూద్ సహాయక చర్యలలో పాల్గొన్నారు. ప్రమాదానికి గురైన యువకుడి కారు సెంట్రల్ లాక్ చేసే ఉండటం వల్ల ఆ కారు నుంచి ఆ యువకుడిని తీయడానికి కాస్త సమయం పట్టింది.

ఈ క్రమంలోనే కారు డోర్లు ఓపెన్ చేసిన అనంతరం సోనూ సూద్ స్వయంగా ఆ యువకుడిని బయటకు తీసి తన కారులో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇలా సోనూసూద్ సరైన సమయానికి స్పందించి ఆ యువకుడిని ఆస్పత్రిలో చేర్చడం వల్ల అతనికి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని పూర్తిగా ప్రాణాలతో బయట పడినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు మరోసారి సోనూసూద్ నిజమైన దేవుడు అంటూ అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.