Crime News: ప్రస్తుత కాలంలో డబ్బు మీద ఉన్న వ్యామోహంతో బంధాలు బంధుత్వాలు మరిచి రక్త సంబంధీకుల వారిని కడతేర్చుతున్నారు.కని ,పెంచిన కొడుకులే అతని పాలిట కాలయముళ్ళు అయ్యారు. 10 లక్షలు కోసం కన్న తండ్రినే కడ తేర్చారు ఆ ఇద్దరు కొడుకులు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని మాండ్య జిల్లా శ్రీరంగపట్టణం తాలూకాలోని కరెమేగలకొప్పలు అనే గ్రామంలో చోటు చేసుకుంది.
మృతుడు మరికాలయ్య (68) క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తూ రిటైర్ అయ్యాడు. అతని ఇద్దరు కుమారులు శశికుమార్, రాజేష్ లు కూడా క్యాబ్ డ్రైవర్లు గా పనిచేస్తూ బెంగళూరులో నివాసం ఉంటున్నారు. మరికాలయ్యకు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ క్రమంలో అవసరాల నిమిత్తం ఇందులో ఒక ఎకరా భూమిని 30 లక్షలకు విక్రయించడానికి ముగ్గురూ కలిసి నిర్ణయించుకున్నారు. ఈ ముప్పై లక్షల ను మూడు భాగాలుగా చేసుకుని తలా పది లక్షలు తీసుకోవడానికి మాట్లాడుకున్నారు.
అయితే మృతుడు మరికలెయ్యకు తెలియకుండా తన ఇద్దరు కుమారులు కొనుగోలు చేసే వారి దగ్గరికి వెళ్లి 30 లక్షలను వారే తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో కొనుగోలుదారులను మరికాలయ్య డబ్బులు అడగగా వారు మీ కొడుకులకు ఇచ్చాం అని నిజం చెప్పారు. దీనితో మృతుడు కొడుకులని ఆయనకి రావలసిన 10 లక్షలు ఇవ్వమని అడగగా వారు ఇవ్వలేదు. తండ్రి ఆయన షేర్ ఇస్తేనే రిజిస్ట్రేషన్ పత్రాల మీద సంతకం చేస్తా అని చెప్పి అక్కడి నుండి వచ్చేశాడు. ఇంటికి వెళ్ళే క్రమంలో మరికాలయ్య అరెకెరె పోలీస్ స్టేషన్లో తనకు తన కొడుకుల నుండి ప్రాణహాని ఉందని కేస్ ఫైల్ చేసాడు. శుక్రవారం రాత్రి మరికాలయ్య ఇంటికి వచ్చిన ఇద్దరు కుమారులు అతనిమీద దాడి చేసి అక్కడి నుండి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.