Soniya: సోనియా సింగ్ పరిచయం అవసరం లేని పేరు ఎంతో చలాకి తనంతో తన మాట తీరుతో అందరిని నవ్విస్తూ సందడి చేసే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా విరూపాక్ష సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సోనియా ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. అయితే సినిమాలలోకి రాకముందు సోనియా షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లలో నటిస్తూ సందడి చేశారు.
ఇక విరూపాక్ష సినిమా ఈమె కెరియర్ కు మంచి టర్నింగ్ పాయింట్ అయిందని చెప్పాలి. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా సోనియా చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా అభిమానులందరూ కూడా ముక్కున వేలు వేసుకున్నారు.
గత కొద్ది రోజుల క్రితం సోనియా ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసినట్టు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ కారు కొని నెలల వ్యవధి కూడా కాకుండానే ఈమె మరో లగ్జరీ కారును కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.రీసెంట్ గా మార్చి లో మెర్సిడెజ్ బెంజ్ కారుని కొన్న సోనియా సింగ్ తాజాగా మరో కాస్ట్లీ కార్ కొని టెంపుల్ దగ్గర పూజ చేయించుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.అంతేకాదు ఈ వీడియోని షేర్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ చేశారు.
ఆ దేవుడు ప్లాన్ ఎప్పటికీ గొప్పగానే ఉంటుంది. ప్రయాణం కష్టంగా ఉన్నా కానీ ఆ దేవున్ని ఎన్నటికీ మర్చిపోవద్దు..ఆ దేవుడు మనకోసం ఏదో గొప్పగా చేస్తున్నాడు అని ఎదురు చూడాలి అంటూ ఈ వీడియోని పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవ్వుతున్నారు. సోనియా రెండు నెలల వ్యవధిలోనే రెండు కార్లు కొనే అంత డబ్బు ఎక్కడిది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సోనియా కొనుగోలు చేసిన మెర్సిడెజ్ బెంజ్ కారు విలువ సుమారు 60 నుంచి 80 లక్షల వరకు విలువ చేస్తుందని తెలుస్తోంది. ఇక తాజాగా ఈమె కొనుగోలు చేసిన బెంజ్4 మ్యాటిక్ కారు ధర ఏకంగా రెండు కోట్ల వరకు ఉంటుందని తెలిసి నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. అలాగే మరి కొంతమంది విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు.