Sonia Agarwal: 17ఏళ్ల తర్వాత కూడా అదే అందం, అదే యాక్టింగ్… మెప్పించిన డిటెక్టివ్ సత్యభామ!

Sonia Agarwal: సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంగా సోనియా అగర్వాల్, రవి వర్మ, కుమార్ సాయి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా డిటెక్టివ్ సత్యభామ. తాజాగా విడుదలైన ఈ చిత్రానికి భారీ స్పందన వస్తోంది. ఎవరూ ఊహించని ట్విస్ట్‌లు, మలుపులు కలిగిన ఈ సినిమాలో సోనీ అగర్వాల్‌ యాక్షన్‌ సీన్స్‌ ప్రేక్షకుల్ని మరింతగా ఆకట్టుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా అన్ని హంగులతో తీర్చిదిద్దిన ఈ చిత్రానికి ఫ్యాన్స్ కూడా అదే రీతిలో స్పందిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో సోనీ అగర్వాల్ నటన చాలా బాగుందని, దీంతో ఆమెకు చాలా క్రేజ్ వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చూడడానికి ఓ రొమాంటిక్ మూవీలాగా, ఓ హర్రర్‌ మూవీలా వెళ్లిపోతూ ఉంటుందని అభిమానులు అంటున్నారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని ఒకసారి చూసి ఎంజాయ్ చేసేలా ఉందని, మరియు యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ అని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయని పబ్లిక్ టాక్.

7G బృందావన కాలనీ సినిమాలో హీరోయిన్ చేసిన యాక్టింగ్ చాలా బాగుందని, ఈ సినిమా తరువాత సుమారు 17 సంవత్సరాలకుఈ సినిమా ద్వారా ఈమె పరిచయమైన అదే అందంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఈ సినిమాకు ఇంత అద్భుతంగా రావడానికి కారణం సోనియా అగర్వాలే అని ఫ్యాన్స్ అంటున్నారు. డిటెక్టివ్ సత్యభామగా ఆమె నటన చాలా సహజంగా ఉందని, చాలా సూపర్బ్‌గా అనిపించిందని వారు తెలిపారు. పార్ట్‌ 1 ఇలా ఉందంటే పార్ట్ 2 ఇంకా చాలా బాగుంటుందని అనుకుంటున్నామని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.