ఎన్టీర్ సినిమా గురించి వస్తున్న వార్తలను కొట్టిపారేసిన సోనాలి బింద్రే..!

ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించాడు. మొట్టమొదటిసారిగా ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు కలిసి నటించిన సినిమా ఇది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటిస్తున్నాడు . ఇక జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 అనే సినిమాలో నటించనున్నాడు.

ఈ సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పటికి ఈ సినిమాకీ సంబంధిన పూర్తి కథ సిద్దం కాకపోవటంతో పాటు మరి కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం చాలారోజులుగా అన్వేషణ జరుగుతోంది. హీరోయిన్ గా అలియా భట్, సాయి పల్లవి, జాన్వీ కపూర్ పేర్లు వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఎవరిని కన్ఫర్మ్ చేయలేదు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో సీనియర్ నటి సోనాలి బింద్రే కీలక పాత్రలో నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల సోనాలి బింద్రే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వార్తల గురించి స్పందించింది. ఎన్టీఆర్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోందని వస్తున్న వార్తలను ఖండిస్తూ .. నాకూ అసలు ఈ సినిమా గురించి అసలు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే దయచేసి నాకు చెప్పండి అంటూ ఆమె చెప్పుకొచ్చింది. దీంతో సోనాలి బింద్రే ఈ సినిమాలో నటిస్తుందని వస్తున్న వార్తలకు క్లారిటీ వచ్చింది.