చంద్ర‌బాబుపై సోము వీర్రాజు స్టెన్ గ‌న్

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కుతంత్ర రాజ‌కీయాల గురించి తెలియంది ఎవ‌రికి. అవ‌స‌రం ఉన్న‌ప్పుడు ఒక‌లా…అవ‌స‌రం తీరినప్పుడు మ‌రోలా! ఊస‌రవెల్లిలా రంగులు మార్చ‌డం ఆయ‌న‌కు అల‌వాటే. ఇత‌ర‌ పార్టీల‌తో మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకుని ముందుకెళ్ల‌డం ఆయ‌న‌కు బాగా తెలిసిన విద్య‌. చంద్ర‌బాబు కి విద్యార్ధి ద‌శ ద‌గ్గ‌ర నుంచి ఇలాంటి వ్యూహాలు వేడ‌యంలో పండిపోయారు. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకుని పార్టీని ముందుకు తీసుకెళ్తారు. ప్ర‌జ‌ల్లో పార్టీ వీక్ గా ఉందంటే మ‌ద్ద‌తంటూ ముందుకొచ్చి గెలిచిన త‌ర్వాత ముడ్డి చూపిస్తాడు. బీజేపీ, జ‌న‌సేన పార్టీలు ఆ ర‌కంగానే ఘోరంగా దెబ్బ‌తిన్నాయి అన్న‌ది తెలిసిందే.

అవ‌కాశ వాది రాజ‌కీయాల‌తో ఆ రెండు పార్టీల‌ను చంద్ర‌బాబు ఓ రేంజ్ లో వాడి వ‌దిలేసారు. తెలిసి తెలిసి ఆయ‌న దారిలోకి వెళ్ల‌డం ఆ రెండు పార్టీల త‌ప్పిదంగా త‌ర్వాత తెలుసుకున్నాయి. అయినా చేతులు కాలిన త‌ర్వాత ఆకులు ప‌ట్టుకుంలే సుఖ‌మేంటి? అప్ప‌టికే జ‌ర‌గాల్సిన అన‌ర్ధం జ‌రిగిపోతుంది. ఆ రకంగా ఆ రెండు పార్టీలు ఏపీలో గ‌ట్టిగానే దెబ్బ‌తిన్నాయి. ప్ర‌స్తుతం ఇప్పుడు ఆ రెండు పార్టీలే ఏపీలో క‌లిసి ప‌నిచేస్తున్నాయి. ఆ విష‌యం ప‌క్క‌న‌బెడితే ఏపీ బీజీపీ కొత్త సార‌థిగా నియ‌మితులైన సోము వీర్రాజు ప‌ద‌వి ద‌క్క‌గానే చంద్ర‌బాబు పార్టీపై స్టెన్ గ‌న్ ఎక్కు పెట్టి తూటాలు వ‌ద‌లడం మొద‌లు పెట్టారు.

చంద్ర‌బాబు వ‌ల్లే ఏపీలో బీజేపీ సున్నా అయింద‌ని విమ‌ర్శించారు. 1996 లో త‌మ‌తో క‌లిసి న‌డ‌వ‌డానికి చంద్ర‌బాబు నిరాక‌రించార‌న్నారు. అయినా తాము 1998 లో 18 శాతం ఓట్లు సాధించామ‌ని గుర్తు చేసారు. ఆ వెంట‌నే బాబు త‌మ బ‌లాన్ని గుర్తించి 98 లో మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లే ఇచ్చి ఓట్ల శాతాన్ని కూల‌గొట్టార‌న్నారు. త‌ర్వాత 2014లో మోదీ వ‌చ్చిన‌ప్పుడు మ‌ళ్లీ చంద్ర‌బాబు క‌లిసాడు. అప్ప‌టి నుంచి పార్టీని నాశ‌నం చేసే వ‌ర‌కూ నిద్ర‌పోలేదన్నారు. పార్టీ ప‌త‌నానికి కాక్షించి కంక‌ణం క‌ట్టుకుని చంద్ర‌బాబు ప‌నిచేసాడ‌ని ఆరోపించారు. ఆయ‌న బీజేపీని ఎలా చూసాడో? టీడీపీని బీజేపీ ఇక‌పై అలాగే చూస్తుంద‌ని దెబ్బ‌కు దెబ్బ తీస్తామ‌ని హెచ్చ‌రించారు.