టీడీపీలో అంతర్గత కలహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎంత దాచినా ఒకటి రెండు రోజులకు మించి విషయాలు దాగడం లేదు. ఒకరని కాదు.. పార్టీలోని అగ్ర నేతల నుండి కార్యకర్తల వరకు చంద్రబాబు తీరు మీద అసహనం వ్యక్తం చేస్తున్నారట. కొన్ని నెలలుగా అధ్యక్షుడు హైదరాబాద్ నివాసానికే పరిమితమవడం కావడం వారిని శ్రేణులను, నేతలను కుంగదీస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో క్యాడర్ పార్టీ ఆఫీసులకు తాళాలు వేసి ఉండటంతో ఏం చేయాలో పాలుపోక
అసంతృప్తితో జెండాలు దించేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న పార్టీలోని సీనియర్ లీడర్లు కొందరు విసిగిపోయి బాబు ముందు బ్లాస్ట్ అవుతున్నట్టు ఒక వర్గం మీడియా కథనాలు వెలువరిస్తోంది.
బాబు ముందు బ్లాస్ట్ అయిన ఆ నేత ఎవరో కాదట సీనియర్ లీడర్ అయ్యన్నపాత్రుడట. రాజకీయాల మీద పూర్తి అవగాహన, మంచి అంచనా శక్తి ఉన్న నేతగా అయ్యన్నకు పార్టీలో పేరుంది. మొన్నామధ్యన చంద్రబాబు ఎప్పటిలానే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేతలకు టచ్లోకి వచ్చారు. ఇలా చేయాలి, అలా చేయాలని ఉపదేశం చేశారట. అంతా విన్న అయ్యన్న ఇంకా ఎన్నాళ్లు ఈ జూమ్ యాప్ మీటింగ్స్. ప్రజల్లోకి వచ్చేది లేదా అన్నారట. పార్టీ అధ్యక్షుడే ఇలా నెలల తరబడి వేరే రాష్ట్రంలో కూర్చుని ఉంటే ప్రజలు ఏమనుకుంటారు. జనం మధ్యలోకి వచ్చి పనిచేస్తే కదా ఫలితం ఉండేది, ఇలా అయితే పార్టీ నడిచినట్టేనని చేతులెత్తేసిన తరహాలో మమసులో మాట చెప్పేశారట.
వీర విధేయుడిగా పేరున్న అయ్యన్న అలా మాట్లాడేసరికి మీటింగ్లో ఉన్న ఇతర లీడర్లే కాదు చంద్రబాబు సైతం ఖంగుతిన్నారట. అయ్యన్న ఇచ్చిన షాక్ తో బాబు తాను హైడరాబాద్లో ఉన్నా లోకేష్ ఏపీలో ఉంటే కొంత బెటరని భావించి చినబాబును పంపారట. కాబట్టే లోకేష్ నిన్న కొల్లు రవీంద్ర ఇంటికి పరామర్శకు వెళ్లారని టాక్. కానీ అయ్యన్న ఈ స్థాయిలో బాబు మీద ఎగిరిపడ్డారంటే నమ్మలేం. ఎందుకంటే చంద్రబాబుతో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది. నేరుగా ఫోన్ చేసి మట్లాడే చనువు ఉంది. నిజంగా ఆయన బాబుగారి వైఖరితో అసంతృప్తిగా ఉంటే అంత మంది ముందు నిలదీయరు. వ్యక్తిగతంగా కాంటాక్ట్ అయి చెప్పాల్సిందేదో చెప్పేవారు. కాబట్టి ఈ వార్తలను నూరు శాతం నిజమేనని అనుకోవడానికి లేదు. టీడీపీ నేతలు ఎవరైనా ఈ కథనాల మీద స్పందించి జరిగిందేమిటో చెబితే బాగుంటుంది.