హైదరాబాద్ లో పాకిస్థానీయులు.. రోహింగ్యాలకు ఓ కాలనీ కూడా.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు?

Some Pakistanis with expired passports living in Hyderabad : kishan Reddy

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో చాలామంది పాకిస్థానీయులు ఉన్నారని.. వాళ్లందరి పాస్ పోర్ట్ గడువు తీరినా కూడా ఇంకా హైదరాబాద్ లోనే మకాం వేశారని కిషన్ రెడ్డి తెలిపారు.

Some Pakistanis with expired passports living in Hyderabad : kishan Reddy
Some Pakistanis with expired passports living in Hyderabad : kishan Reddy

వాళ్లకు సంబంధించిన పూర్తి రిపోర్టు కేంద్రం వద్ద ఉందని.. కేంద్రం దీనిపై చాలా సీరియస్ గా ఉందని ఆయన స్పష్టం చేశారు. రోహింగ్యాలకు హైదరాబాద్ లో ఓ కాలనీ ఉందని.. ఆ కాలనీలోని రోహింగ్యాలందరి పేర్లను ఓటర్ లిస్టులో ఎక్కించారని ఆయన తెలిపారు.

రోహింగ్యాల అందరి పేర్లు మాదగ్గర ఉన్నాయి. హైదరాబాద్ తో పాటుగా దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో రోహింగ్యాలు ఉన్నారు. దీనిపై కేంద్రం కూడా సమీక్షిస్తోంది. హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉన్నారని తెలిసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు.. అంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు.