ఇండస్ట్రీ టాక్ : రామ్ సినిమాకి భారీ హిందీలో భారీ ఆఫర్.?

నిన్ననే మన టాలీవుడ్ నుంచి మరో యంగ్ హీరో అయినటివంటి ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా పాన్ ఇండియన్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యినట్టు కన్ఫర్మ్ అయ్యింది. అయితే నార్త్ ఆడియెన్స్ లో యూట్యూబ్ వరకు భారీ స్థాయిలో మిలియన్ వ్యూస్ తో రామ్ సినిమాలు కూడా బాగానే చూసారు.

పైగా 100 మిలియన్ కి పైగా వ్యూస్ ఉన్న చిత్రాలు తన ఖాతాలో ఎక్కువ గానే ఉన్నాయి. మరి ఈ లిస్ట్ ని థియేటర్స్ కి తీసుకువచ్చే విధంగా తాను నటిస్తున్న లేటెస్ట్ మాస్ ఏక్షన్ డ్రామా “ది వారియర్” ని హిందీలో కూడా అనౌన్స్ చేశారు.

మరి ఈ హిందీ పోస్టర్ కి కూడా ఇండస్ట్రీ వర్గాల్లో మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు ఈ సినిమాకి హిందీలో పలికిన ధర వైరల్ అవుతుంది. ఈ సినిమాకి గాను ఏకంగా 16 కోట్లు ఆఫర్ చేశారట. దీనితో ఈ ఫిగర్ కి వారియర్ హక్కులు లాక్ చేశారట.

ఇక ఈ సినిమాని మాస్ దర్శకుడు ఎన్ లింగుసామి దర్శకత్వం వహిస్తుండగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి అలాగే ఈ సినిమాలో రామ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు.