Sobhita: ఆ విషయంలో సమంతనే మించిపోయిన అక్కినేని కొత్త కోడలు శోభిత…. అక్కినేని పరువు తీస్తుందిగా?

Sobhita: సినీ నటి శోభిత ధూళిపాళ్ల ఇటీవల నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నటుడు నాగచైతన్య ఇదివరకు సమంతను పెళ్లి చేసుకుని ఆమెకు విడాకులు ఇచ్చారు ఇలా సమంత నాగచైతన్య ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్ని విభేదాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇలా సమంత నాగచైతన్య విడిపోయిన కొద్ది రోజులకే నాగచైతన్య తిరిగి శోభిత ప్రేమలో పడ్డారు. ఇలా శోభితను గత రెండు సంవత్సరాలుగా ప్రేమించిన నాగచైతన్య గత ఏడాది డిసెంబర్ నెలలో అన్నపూర్ణ స్టూడియోలో కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటనే ప్రశ్న అందరిలోనూ అప్పట్లో తలెత్తింది. అప్పట్లో సమంత పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ సినిమాలలోనూ అలాగే వెబ్ సిరీస్లో నటించడం వల్ల నాగచైతన్య సమంత మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి అనేవాదన తెరపైకి వచ్చింది.

ఇలా సమంత గ్లామర్ షో చేయటం వల్లే నాగచైతన్య వదిలి పెట్టారని వార్తలు వినిపించాయి కానీ శోభిత మాత్రం పెళ్లయిన రెండు నెలలకే పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సభ్యసాచి 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈమె ర్యాంప్ వాక్ చేశారు. ఇందులో భాగంగా ఈమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ ఫోటోలలో ఈమె మెడలో మంగళసూత్రం కూడా లేకపోవడంతో విమర్శలు చేస్తున్నారు. పెళ్లి సమయంలో సాంప్రదాయాలు ఆచారాలు మూలాలు అంటూ ఎంతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన శోభిత పెళ్లయిన రెండు నెలలకి మెడలో మంగళసూత్రం కూడా తీసేసి తిరుగుతున్నారు అంటూ సమంత ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఒకప్పుడు సమంత చేస్తే తప్పని చెప్పారు మరి ఇప్పుడు శోభిత చేస్తోంది ఏంటి అంటూ విమర్శలు చేస్తున్నారు.