Pooja Hegde : పాపం పూజా హెగ్డే.. బలే దెబ్బేసారుగా అంటూ ట్రోల్స్.!

Pooja Hegde :గత కొన్నాళ్ల కితం వరకు మన టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అతి తక్కువ మంది స్టార్ హీరోయిన్స్ లో డస్కీ బ్యూటీ పూజా హెగ్డే కూడా ఒకర్తి.అయితే పూజా హెగ్డే పై ఉన్న ఈ మార్క్ తోనే చాలా మంది సినిమా నిర్మాతలు ఆమెని హీరోయిన్ గా తీసుకుంటున్నారు.
కానీ ఆమె నటించిన లేటెస్ట్ సినిమా “రాధే శ్యామ్” భారీ ప్లాప్ అయ్యి ఊహించని స్థాయి నష్టాలని మిగిల్చే సరికి పూజా విషయంలో కాస్త అంతా ఆలోచిస్తున్నారు.
అయితే పూజా హెగ్డే కి కూడా ఎప్పుడైతే భారీ ఆఫర్స్ రావడం మొదలయ్యాయో ఆమె కూడా తెలుగు సినిమాపై కామెంట్స్ చెయ్యడం స్టార్ట్ చేసింది. దీనితో ఈమెపై నెగిటివిటీ రాగా తర్వాత ఏదో సర్ది చెప్పుకుంది.
ఆ తర్వాత కూడా తాను చేసిన రాధే శ్యామ్ మినహా ఇతర తెలుగు సినిమాలపై ఒక్క పోస్ట్ కూడా పెట్టిన పాపాన పోలేదు. కానీ ఆమె తమిళంలో చేస్తున్న సినిమా “బీస్ట్” పై అయితే ఓ రేంజ్ పోస్టులు వీడియో లు రీల్స్ ఇలా చాలానే హడావుడి చేసింది.
కానీ ఇంత హడావుడి చేసిన ఈమెకు ఈ సినిమా మేకర్స్ గట్టి షాక్ ఇచ్చారని నెటీజన్స్ ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. లేటెస్ట్ గా వచ్చిన “బీస్ట్” ట్రైలర్ లో ఈమెని కనీసం పట్టుమని పది సెకండ్ లు కూడా చూపించకపోవడంతో ఏదేదో చేసింది ఇప్పుడు ఆమె స్క్రీన్ స్పేస్ నే తగ్గించేసారని పలువురు నెటిజన్లు ఆమెకి కౌంటర్లు ఇస్తున్నారు.
దీనితో పాపం పూజా హెగ్డే అని అంతా అనుకుంటున్నారు. ట్రైలర్ చూస్తే సినిమా అంతా కూడా విజయ్ పైనే ఉన్నట్టు అనిపిస్తుంది. మరి పూజా కి ఎలాంటి పాత్ర ఇచ్చారో చూడాల్సిందే.