వ్యాక్సిన్లపై ఇన్ని అనుమానాలా.? ఎవరూ నిజాలు చెప్పరేం.!

So Many Doubts On Vaccines, But Why

కోవిడ్ 19 లేదా కరోనా వైరస్.. పేరేదైతేనేం.. ప్రపంచాన్ని వణికించేస్తోంది ఈ మహమ్మారి. ప్రపంచంలో చాలా దేశాలు ఈ మహమ్మారి దెబ్బకు విలవిల్లాడుతున్నాయి. అయితే, ఎక్కడా లేనంత గందరగోళం భారతదేశంలో కరోనా వైరస్ విషయంలో కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా కరోనా బాధితులకు వైద్య చికిత్స అందించే విషయంలో, వ్యాక్సినేషన్ విషయంలో రోజుకో కొత్త వివాదం తెరపైకొస్తోంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఐవర్ మెక్టిన్, రెమిడిసివిర్.. ఇలా పలు మందుల విషయమై భిన్న వాదనలు తెరపైకొచ్చాయి. చివరికి ఈ మూడు మందుల వల్లా ఉపయోగం లేదని ఆయా సందర్భాల్లో తేలింది.

ఇక, వ్యాక్సిన్ విషయానికొస్తే.. దేశంలో ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు అందుబాటులో వున్నాయి.. అందులో రెండు మన దేశంలోనే తయారవుతున్నాయి. ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సిన్ రష్యాలో తయారైంది. ఆ వ్యాక్సిన్ విషయమై పెద్దగా వివాదాల్లేవు. కానీ, కోవిషీల్డ్ అలాగే కోవాగ్జిన్.. ఈ రెండూ భారతదేశంలోనే తయారవుతున్నాయి. వీటిల్లో కోవిషీల్డ్ విదేశీ వ్యాక్సిన్.. తయారీ మాత్రమే ఇక్కడ. కోవిషీల్డ్, కోవాగ్జిన్.. ఈ రెండూ కరోనా వైరస్ మీద ఎలా పోరాడుతున్నాయి.? అన్నదానిపై రకరకాల అధ్యయనాలు జరిగాయి. వీటిల్లో కోవాగ్జిన్ కంటే కోవిషీల్డ్ మెరుగైన రక్షణ ఇస్తోందని తేలింది. ఇంతలోనే, కొత్త వేరియంట్లపై రెండు వ్యాక్సిన్ల ప్రభావం అంతంతమాత్రమే.. అంటూ ఇంకో వాదన తెరపైకొచ్చింది.

ఇటీవలి కాలంలో భారతదేశంలో ప్రబలిన కొత్త వేరియంట్ విషయానికొస్తే, దానిపై కోవాగ్జిన్ మంచి పనితీరు కనిపిస్తోందంటూ మరో వాదన వినిపిస్తోంది. ఏ వాదనను అర్థం చేసుకోవాలో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ఏ వ్యాక్సిన్ వేసుకున్నాసరే, కరోనా తీవ్రత నుంచి కాపాడుకోవచ్చన్నది వైద్య నిపుణుల మాట. అంటే, వ్యాక్సిన్ సంపూర్ణమైన రక్షణ ఇవ్వదు. అది ఏ వ్యాక్సిన్ అయినాసరే. అదొక్కటే మనం గుర్తు పెట్టుకోవాల్సింది. ఇలా ఎప్పటికప్పుడు వెలుగు చూసే అధ్యయనాల విషయమై ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించకపోతే, వ్యాక్సిన్ వేయించుకోవడానికి జనం భయపడుతూనే వుంటారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles