Sneha: వింత వ్యాధితో బాధపడుతున్న స్నేహ… నన్ను మాత్రమే మార్చలేదంటున్న భర్త?

Sneha: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు ఎంతో మంది వివిధ రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే పలు సందర్భాలలో వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి బయట పెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే నటి స్నేహ కూడా ఇలాంటి ఒక వింత వ్యాధితో బాధపడుతున్నారని తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన స్నేహ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు అయితే ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా వరుస సినిమాలలో నటిస్తూ స్నేహ ఎంతో బిజీగా ఉన్నారు. ఆ ప్రస్తుతం సినిమాలలో అక్క వదిన పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు. ఇక స్నేహ తమిళ నటుడు ప్రసన్నను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు సంతానం ఇలా కుటుంబంతో కలిసి స్నేహ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

ఇకపోతే స్నేహ గత కొంతకాలంగా ఒక వింత వ్యాధితో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని తన భర్త ప్రసన్న బయటపెట్టారు. స్నేహకు ఓసిడి ప్రాబ్లం ఉందని తెలిపారు. ఆమెకు ఎక్కడ దుమ్ము ధూళి కనిపించకూడదు ఇంట్లో కూడా ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మనశ్శాంతిగా ఉంటుందని లేదంటే చిరాకు పడుతూ ఉంటుందని తెలిపారు.

ఇలా ఇంట్లో ఎప్పుడు చూడు సర్దుతూనే ఉంటుందని ప్రసన్న తెలిపారు. ఈమెకు ఉన్న ఓసిడి ప్రాబ్లం కారణంగా నేను ఇప్పటికీ మూడు ఇండ్లు మారాల్సి వచ్చింది అది బాలేదు ఇది బాలేదు అంటూ ఇంట్లో వస్తువులన్నీ మార్చేస్తూ ఉంటుంది నన్ను మాత్రమే మార్చలేదు అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలకు స్నేహ కూడా స్పందిస్తూ నాకు శుభ్రత లేకపోతే చాలా చిరాకు వస్తుందని నీట్ గా ఉన్నప్పుడే మనశాంతి ఉంటుందంటూ కూడా తెలిపారు.