తెలంగాణ కొత్త సచివాలయ డిజైన్‌లో మార్పులు..!

తెలంగాణలో పాత సచివాలయ భవనం కూల్చి అదే స్థానంలో కొత్త సచివాలయ భవనం నిర్మించేందుకు కేసీఆర్ సర్కార్ అన్ని విధాల ముందడుగు వేస్తుంది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, కేసీఆర్ రెండోసారి సీఎంగా గెలిచిన తరువాత పాత సచివాలయ భవనాన్ని కూల్చేసి అదే స్థానంలో కొత్త సచివాలయం నిర్మాణాన్ని చేపట్టాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 27, 2019న కొత్త సచివాలయానికి శంకుస్థాపన జరిగినా ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించడంతో ఇన్ని రోజులు దానికి అడ్డంకి ఏర్పడింది.

ఇటీవల పాత సచివాలయ భవనం కూల్చివేత పనులు మొదలుపెట్టగానే కొన్ని అడ్డంకులు ఏర్పడి హైకోర్ట్ స్టే విధించగా ఇటీవలే ఆ స్టేను ఎత్తివేస్తూ కూల్చివేతలకు న్యాయ స్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అత్యాధునిక టెక్నాలజీతో, ఆరు లక్షల చదరపు అడుగుల్లో 500 కోట్ల వ్యయంతో చారిత్రాత్మకత కట్టడంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయ భవన నమూనాను గతంలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ డిజైన్‌లో ప్రభుత్వం కొన్ని మార్పులు చేయనుంది. సీఎం కేసీఆర్ కొన్ని మార్పులు, చేర్పులు సూచించడంతో దానికి అనుగుణంగా అధికారులు వచ్చే వారంలోపు కొత్త డిజైన్ రెడీ చేయనున్నారు. కొత్త డిజైన్ పరిశీలించాక సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేస్తే కనుక అఫిషియల్‌గా మరోసారి మార్కులతో కూడిన కొత్త డిజైన్‌ను అధికారులు బయటకు రిలీజ్ చేయనున్నారు.                                                      
ఇదిలా ఉండగా దీనిపై మంగళవారం మద్యాహ్నం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. కొత్త సచివాలయ భవనానికి సంబంధించిన డిజైన్లను, అందులో గల ప్రాముఖ్యతలను, లోపల ఉండే సౌకర్యాలను గురుంచి అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం మంత్రివర్గంలో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తరువాత టెండర్లను ఆహ్వానించి, భవన సముదాయ నిర్మాణాన్ని ప్రారంభించబోతున్నారు.