Chiranjeevi: ఆరేళ్లు.. వరుసగా ఆరు హిట్స్ మెగాస్టార్ స్టామినా ఇదీ !

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటజీవితంలో 1987 నుంచి 1992 వరకు గోల్డెన్ పిరియడ్ అని చెప్పాలి. ఈ ఆరేళ్ల కాలంలో వరుసగా 6 బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు. ఈ ఆరు చిత్రాల్లో రెండింటికి రాఘవేంద్రరావు, ఇంకో రెండు చిత్రాలకు కోదండరామిరెడ్డి, మిగిలిన రెండు చిత్రాలల్లో ఒకదానికి రవిరాజా పినిశెట్టి, ఇంకోదానికి విజయ్ బాపినీడు దర్శకత్వం వహించారు.

ఇక వివరాల్లోకి వెళితే, సినిమా అంటే ఇలాగే ఉండాలన్న మూస ఫార్ములాతో తెలుగు చిత్రాల నిర్మాణం సాగుతున్న సమయంలో ఆ రొటీన్‌కు బ్రేక్ వేసిన చిత్రం పసిపాడి ప్రాణం. ఖైదీ, అడవిదొంగ చిత్రాల తర్వాత చిరంజీవి మార్కెట్‌ను అనూహ్యంగా పెంచిన చిత్రం ఇది. బ్రేక్ డాన్స్‌ను పరిచయం చేసి, నృత్యంలో ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టించిన చిత్రం కూడా ఇదే. ఇకపోతే ఆ తర్వాత వచ్చిన యముడికి మొగుడు చిత్రం బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంతో రవిరాజా పినిశెట్టి పూర్తిస్థాయి కమర్షియల్ డైరక్టర్‌గా నిలబడ్డారు. చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో విజయశాంతి, రాధ హీరోయిన్లుగా నటించారు.

ఇదిలా ఉండగా అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అనే చిత్రంతో చిరంజీవి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను దుమ్మురేపిందనే చెప్పవచ్చు. ప్రారంభం నుంచి చివరి వరకు ఎలాంటి బాధాకరమైన సీన్లు లేకుండా పూర్తి వినోదకరమైన చిత్రంగా ఈ మూవీని తీర్చిదిద్దారు. ఆ తర్వాత వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం మెగాస్టార్ చిత్రాల స్థాయిని సమూలంగా మార్చేసింది.

ఇకపోతే మెగాస్టార్‌ స్థాయిని శిఖరాగ్ర స్థాయికి తెచ్చిన చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ చిత్రం ఏ తెలుగు సినిమా వసూలు చేయనంతగా 6 కోట్లకు పైగా వసూలు చేసింది. ఒకే రోజు 4 సెంటర్లలో 100 రోజుల వేడుకను నిర్వహించి చరిత్ర సృష్టించారు విజయ్ బాపినీడు. ఇకపోతే తదనంతరం వచ్చిన సినిమా ఘరానా మొగుడు. ఈ సినిమా గత రికార్డులను బద్దలు కొట్టి, ఒక తెలుగు చిత్రం 4 కోట్ల రూ.లకు అమ్ముడవడం, అదీ హిట్ అయ్యి 10 కోట్లను వసూలు చేయడం అత్యంత విశేషంగా మారింది. రాఘవేందర్‌రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నగ్మా, వాణీ విశ్వనాథ్ కథానాయికలుగా నటించారు.