srihaan: బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వనున్న సిరి ప్రియుడు.. శ్రీహాన్!

srihaan: బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో కార్యక్రమానికి ఎంతో ప్రేక్షకాదరణ ఉంది. ఇక ఇప్పటికే తెలుగులో 5 సీజన్లలో ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత నాలుగు సీజన్లలో పోలిస్తే ఐదవ సీజన్ పెద్దఎత్తున వివాదాలను ఎదుర్కొందని చెప్పవచ్చు.యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి పాపులారిటీ సంపాదించి ఆ పాపులారిటీతో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్ జస్వంత్, సిరి వ్యవహారశైలిని ప్రతి ఒక్కరు తప్పుబడుతూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కారణంగా షణ్ముఖ్ యశ్వంత్ తన ప్రియురాలు దీప్తి సునయనతో విడిపోయారు.

ఇక సిరి, తన ప్రియుడు శ్రీహన్ తో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి నిశ్చితార్థం తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్ళిన ఈమె ఆ విషయాన్ని మర్చిపోయి షణ్ముఖ్ జస్వంత్ తో చనువుగా ఉండటం వల్ల వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలుస్తోంది. ఇలా సిరి ద్వారా ఎంతో ఫేమస్ అయిన శ్రీహాన్ కి ప్రస్తుతం ఒక అద్భుతమైన అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ తర్వాత కార్యక్రమాన్ని బుల్లితెరపై కాకుండా ఓటీటీ లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ కార్యక్రమానికి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ వీళ్ళే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అలా వినిపిస్తున్న పేర్లలో సిరి ప్రియుడు శ్రీహాన్ పేరు కూడా ఉంది. బిగ్ బాస్ వచ్చే సీజన్లో శ్రీహాన్ పాల్గొంటున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.ఇక బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ద్వారా తన ప్రేయసి సిరి ఇమేజ్ డామేజ్ అయిన సంగతి మనకు తెలిసిందే.ఇలాంటి సమయంలో శ్రీహాన్ బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్ళడు అని కొందరు భావించగా మరికొందరు మాత్రం అధిక మొత్తంలో పారితోషికం ఇస్తే వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు. మరి ఈ విషయంలో శ్రీహాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.