బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతోమంది పాపులర్ అయ్యారు. కొందరు ఈ బిగ్ బాస్ వల్ల మంచి పేరుతో గుర్తింపు పొందితే, మరికొందరు మాత్రం నెగిటివిటి మూటకట్టుకున్నారు. అలా బిగ్ బాస్ ద్వార నెగెటివ్ ఇంప్రెషన్ తో బయటకి వచ్చిన వారిలో సిరి, షణ్ముఖ్ కూడ ఉన్నారు. మీరిద్దరూ బిగ్ బాస్ సీజన్ 5 లో పార్టిసిపేట్ చేశారు. అక్కడ వీరిద్దరి ప్రవర్తనతో ప్రేక్షకులు విసిగిపోయారు. హౌజ్ లో కెమెరాలు ఉన్న విషయం కూడా మరచిపోయి హద్దులు దాటి మరి ప్రవర్తించారు. బిగ్ బాస్ హౌస్ లో వీళ్ళు చేసిన ఓవరాక్షన్ వల్ల షణ్ముఖ్ దీప్తికి దూరమయ్యాడు.
యూట్యూబర్ గా తమ కేరీర్ ప్రారంభించిన షణ్ముఖ్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరిస్ తో చాలా పాపులర్ అయ్యాడు. అంతేకాకుండా దీప్తి సునైనతో రిలేషన్స్ లో ఉండటం వల్ల వీరిద్దరు జంటగా కూడ చాలా ఫేమస్ అయ్యారు. అందువల్ల ఇద్దరు బిగ్ బాస్ లో పాల్గొనటానికి అవకాశం పొందారు. మొదట దీప్తి బిగ్ బాస్ లో పాల్గొని పాజిటివ్ కామెంట్స్ తో మరింత క్రేజ్ పెంచుకుంది. కానీ తర్వాత సీజన్ లో షణ్ముఖ్ బిగ్ బాస్ షోలో పాల్గొన్నాడు. ఆ సమయంలో సిరితో కలిసి షణ్ముఖ్ చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాడు. వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారేమో అని ప్రేక్షకులు కూడ అనుమనపడ్డారు.
ఇద్దరు కలసి బిగ్ బాస్ షోలో హద్దులు దాటి ప్రవర్తిస్తూ వారి కోసం బయట వారు ప్రేమించిన వారూ ఉన్నారన్న సంగతి కూడ మర్చిపోయారు. అందువల్ల షణ్ముఖ్ బయటికి రాగానే దీప్తి తనకి దూరంగా ఉంటూ అన్ని సోషియల్ మీడియా అకౌంట్స్ లో బ్లాక్ చెసింది. అంతేకాకుండా జనవరి 1 వ తేదీన షణ్మఖ్ కి బ్రేకప్ చెప్తున్నట్లు అధికారికంగా పోస్ట్ చెసింది. ఇక సిరి విషయంలో కూడా శ్రీహాన్ తమ ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు వార్తల వినిపించాయి.కానీ వీరిద్దరు తరచు కలసి పార్టీలకు వెళ్తూ ఆ వార్తల్లో నిజం లేదని నిరూపించారు. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత సిరి, షణ్ముఖ్ ఎక్కడ కలవలేదు. ఈ విషయం గురించి యాంకర్ అడగగా, దానికి సిరి మాట్లాడుతూ.. బ్రేకప్ తర్వాత కలవడం ఎవరికి మంచిది కాదు కదా. ఎవరి లైఫ్‌లో వారు బిజీగా ఉన్నాం. కొంత సమయం తర్వత అన్నీ చక్కదిద్దుకుంటాయని సిరి స్పష్టం చేసింది.