ప్రియుడితో కలిసి బుల్లితెర వేదికపై అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన సిరి?

బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లకముందు సిరి హనుమంత్ ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈ విధంగా ఒక వైపు సీరియల్ లో నటించడమే కాకుండా మరోవైపు యూట్యూబ్ వీడియోలు వెబ్ సిరీస్ లో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమానికి ఎంట్రీ ఇచ్చారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఈమె ఎంతో నెగిటివిటీని మూట కట్టుకొని పాపులర్ అయ్యారు.

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఈమెకు వచ్చిన నెగిటివిటీ తో ఏకంగా తన ప్రియుడితో బ్రేకప్ చెప్పుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి. కొద్ది రోజుల పాటు ఈ జంట కలిసి సోషల్ మీడియాలో సందడి చేయకపోవడంతో వీరిద్దరూ విడిపోయారని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ వార్తలన్నీ ఒట్టి పుకార్లే అని కొట్టిపారేస్తూ ఈ జంట యధావిధిగా సోషల్ మీడియాలో సందడి చేశారు.అయితే ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి పలు వెబ్ సిరీస్ లోనూ అలాగే యూట్యూబ్ వీడియోలను నటించారు.

ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి బుల్లితెర వేదికలపై ఎక్కడా నటించలేదు. అయితే మొదటి సారిగా మొగుడ్స్ పెళ్లామ్స్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది బుల్లితెర జోడీలు అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ లో అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో అందరిని సందడి చేశారు. ఈ క్రమంలోనే ఈ వేదికపై మొట్టమొదటిసారి సిరి తన ప్రియుడితో కలిసి ఫుల్ కిక్కూ అనే మాస్ పాటలకు అద్భుతమైన స్టెప్పులు వేసి అందరిని సందడి చేశారు. ఇకపోతే సిరి ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న శ్రీహాన్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ అవకాశం వచ్చిందనే వార్తలు వినపడుతున్నాయి.