Big Boss 6: బిగ్ బాస్ 6 లోకి వెళ్లనున్న సిరి ప్రియుడుశ్రీహాన్?

Big Boss 6:బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే ఈ కార్యక్రమం తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకొని ఒక నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 6 ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్ ల ఎంపిక కూడా శరవేగంగా జరుగుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొందరు కంటెస్టెంట్ ల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమంలోకి సిరి ప్రియుడు శ్రీహాన్ కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అవుతుంది. సిరి యూట్యూబ్ వీడియోలు ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి శ్రీహాన్ ఈసారి ప్రసారంకాబోయే బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్తున్నట్టు, ఆల్మోస్ట్ ఇతను కన్ఫర్మ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. సీజన్ ఫైవ్ ద్వారా సిరి యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి ఎలాంటి రచ్చ చేసిందో మనకు తెలిసిందే. అయితే సిరి వ్యవహారశైలి వల్ల శ్రీహాన్ ఎంతో ఫేమస్ అయ్యారు.

ఈ క్రమంలోనే ఈమె బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ తో చనువుగా ఉండటం వల్ల ప్రేమించిన వ్యక్తిని సిరి మోసం చేస్తోంది అంటూ పెద్ద ఎత్తున తన పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా వేదిక పైకి వచ్చిన శ్రీహాన్ పరోక్షంగా తనని వద్దు అనుకుంటున్నావా అంటూ మాట్లాడారు. దీంతో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే సిరిని అర్థం చేసుకున్న శ్రీకాంత్ తనతో తన రిలేషన్ కొనసాగిస్తున్నారు. ఇలా సిరి ద్వారా ఫేమస్ అయిన ఈయన సీజన్ 6 కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలియడంతో ఖచ్చితంగా టైటిల్ ఇతనికే వస్తుందని వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.