బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఎంట్రీ ఇవ్వనున్న సిరి బాయ్ ఫ్రెండ్..

ఇటీవలే నాన్ స్టాప్ బిగ్ బాస్ సీజన్ పూర్తయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బుల్లితెరపై కూడా సీజన్ ఫైవ్ కూడా పూర్తి కాగా త్వరలో సీజన్ 6 కూడా ప్రారంభం కానుంది. ఇక ఈ విషయం గురించి సోషల్ మీడియాలో బాగా చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ ల పేర్లు కూడా బాగానే వినిపిస్తున్నాయి.

అందులో సీజన్ ఫైవ్ లో పాల్గొని బాగా రచ్చ చేసిన సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. సిరి ద్వారనే శ్రీహాన్ టాలీవుడ్ ప్రేక్షకుల్లో మరింత పరిచయం పెంచుకున్నాడు. దీంతో ఇతడికి నాన్ స్టాప్ బిగ్ బాస్ షోలో అవకాశం వస్తే దానిని వదులుకున్నాడట. ఇక ఈ సీజన్ 6లో అతడికి అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.