Siri – Srihan: బిగ్ బాస్ షో కి వెళ్లి వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చెప్పడం అంచనా వేయడం చాలా కష్టం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత మనుషుల మధ్య బంధాలు, ప్రేమలు ఎలా ఉంటాయో చెప్పడం చాలా కష్టం. ఇకపోతే బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ షో పుణ్యమా అని ఈసారి రెండు జంటలు విడిపోయారు. దీప్తి సునయన ఏకంగా తన ప్రియుడు షణ్ముఖ్ షణ్ముఖ్ కీ బ్రేకప్ చెప్పేసింది. మరొకవైపు శ్రీహాన్ తన ప్రియురాలు సిరి కీ గుడ్ బై చెప్పేసాడు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ రెండు జంటలలో ఒక జంట తిరిగి ఒకటి అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షో లో సిరి, షణ్ముఖ్ జస్వంత్ సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో హగ్గులు, కిస్సులు లాంటివి చేస్తూ రెచ్చిపోయారు. ఇక ఈ షోని వీక్షిస్తున్న ప్రేక్షకులు అయితే వారిద్దరిపై ఒక రేంజ్ లో ట్రోలింగ్ చేశారు. బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వక ముందు షణ్ముఖ్ జస్వంత్ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ దీప్తి సునైనా ను ప్రేమిస్తున్నాడు. ఇక సిరి కూడా యూట్యూబ్ శ్రీహాన్ ను ప్రేమించింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ రెండు జంటలకు పెళ్లిళ్లు కూడా జరుగుతాయని వార్తలు వినిపించాయి.
ఒకవేళ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వక పోయి ఉంటే ఈ రెండు జంటలకు వివాహం కూడా జరిగి ఉండేది. కానీ బిగ్ బాస్ షో మొదలయిన తరువాత ఈ రెండు జంటల మధ్య నిదానంగా దూరం ఏర్పడింది. ఆ దూరం కాస్త వివాదాల వరకు దారి తీసింది. అలా ఏకంగా ఒక జంట అయితే సోషల్ మీడియా వేదికగా బ్రేకప్ అని ప్రకటించేశారు. మరొక జంట అటు కలవను లేదు, వీడిపోను లేదు. కానీ ఆ జంట వాలకం చూసి వారిద్దరూ విడిపోయారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు సృష్టించారు. బిగ్బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత సిరి, ప్రియుడు శ్రీహన్ ఒక్కసారి కూడా కలుసుకోలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఇటీవల సిరి, శ్రీహాన్ ల జంట హైదరాబాద్ లో యాంకర్ రవి ఇంట్లో కలిశారు. యాంకర్ రవి కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు కూడా దిగారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను యాంకర్ రవి భార్య ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఆ జంట కలవడం సంతోషంగా ఉంది అని ఆమె ట్వీట్ చేసింది. షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన ఎలా పరిస్థితి ఏమీ అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.