సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే శ్రీరెడ్డి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా ఒక్కసారిగా ఎంతో పాపులర్ అయ్యారు. ఇండస్ట్రీలో తనని ఎంతోమంది క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులకు గురి చేశారు అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వార్తల్లో నిలిచారు. ఈ విధంగా ఈ ఘటన నుంచి ఈమె నిత్యం ఏదో ఒక విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పెద్దఎత్తున వివాదాలను సృష్టిస్తూ ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె యూట్యూబ్ ఛానల్ వీడియో ద్వారా వంటలక్కగా మారి తన చేతి రుచిని చూపిస్తున్నారు.
ఇప్పటికే ఎన్నో రకాల వీడియోలను షేర్ చేసిన ఈమె తాజాగా తమిళ నాడులోని ఒక రెస్టారెంట్ కు వెళ్లి ఒక వీడియో చేశారు. ఈ వీడియోలో భాగంగా ఆ రెస్టారెంట్ లో అచ్చం పల్లెటూరు రుచులను కలిగి ఉంటుందని, అందుకే రెస్టారెంట్లో భోజనాలు రుచి చూడటం కోసం వచ్చానని శ్రీ రెడ్డి తెలిపారు. ఈ విధంగా ఈమె రెస్టారెంట్ లో అన్ని రకాల నాన్ వెజ్ ఆర్డర్ చేసి చూశారు. రొయ్యల బిర్యానీ, మటన్, చికెన్, చేపల ఫ్రై వంటి వివిధ రకాల ఆహార పదార్థాలను ఆర్డర్ చేసి రుచి చూశారు.అయితే ఆ హోటల్ లో ఉన్నటువంటి ఆహార పదార్థాలను రుచి చూసి చివరికి ఏవీ రుచి లేవని చెప్పారు.
ఆమె ఆర్డర్ చేసిన ఫుడ్ లో కేవలం రెండు రకాల పదార్థాలు మాత్రమే రుచిగా ఉన్నాయని మిగిలిన పదార్థాలు పెద్దగా రుచి లేవని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ రెస్టారెంట్ లో ఆహార పదార్థాల రుచి కానీ ఈమె పదికి 6 మార్కులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ వీడియోకి బాగా దొబ్బి తిని కేవలం ఆరు మార్కులు మాత్రమే ఇచ్చినట్టు థంబ్ నెయిల్ పెట్టారు. ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.