Sundarakanda : సింగిల్ మూవీ సెన్సేషన్: ఆ అందాల భామ ఇప్పుడేం చేస్తోందో తెలుసా.?

Sundarakanda :  ‘సుందరకాండ’ సినిమాలో పెళ్లయిన మాస్టార్‌ని ఆట పట్టించే లేడీ స్టూడెంట్‌ క్యారెక్టర్ గుర్తుంది కదా. పేరు అపర్ణ. కళ్లద్దాలు, సొట్ట బుగ్గలు, క్యూట్ లుక్స్.. చేసింది ఒక్కటే సినిమా అయినా కానీ, తన అల్లరి నటనతో  తెలుగు ప్రేక్షకుల మనసులో చెరిగిపోని ముద్ర వేసింది అందాల అపర్ణ.
తొలి సినిమాకే అంత మంచి పేరు తెచ్చుకున్న అపర్ణ ఆ తర్వాత సినిమాల్లో ఎందుకు నటించలేదు.? ఆమె వెల్ ఎడ్యుకేటెడ్. స్పెషల్ ఎడ్యుకేషన్స్‌లో మాస్టర్ డిగ్రీ పట్టాలు అందుకుంది. స్టడీస్ తర్వాత పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైపోయింది.
పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం మంచిది కాదనే అభిప్రాయంతో అప్పట్లో సినిమాలకు దూరమైందట. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆలోచనలూ మారాయ్. సో, ఇప్పుడు అవకాశమొస్తే నటించడానికి సిద్ధంగా వున్నాను అని అపర్ణ చెప్పడం విశేషం.
అయితే, ఇప్పుడు అవకాశాలు వస్తాయా.? ఎందరో ముద్దుగుమ్మలు సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి ఛాన్సుల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు అవకాశాలు దక్కించుకుంటూ, రీ ఎంట్రీలోనూ సత్తా చాటుతున్నారనుకోండి.
మరి, అపర్ణ సంగతేంటీ.? రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో అపర్ణ తన డ్రీమ్ గురించి చెబుతూ, మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించాలనుందన్న తన మనసులోని మాట బయటపెట్టింది. జస్ట్ చిన్న సీన్ అయినా ఓకే అంటోంది ఈ అల్లరి పిల్ల అపర్ణ.
ఏమో.! ఎవరికి తెలుసు. కొన్ని కొన్ని క్యారెక్టర్లు కొందరి కోసం అలా పుట్టుకొస్తాయంతే. అలాగే అపర్ణ కోసం కూడా ఓ మంచి ఆఫర్ వచ్చిందంటే, అమెరికా నుండి రెక్కలు కట్టుకుని టాలీవుడ్‌లో వాలిపోదూ.!