Singer Sunitha: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సింగర్ సునీత కొడుకు.. నిర్మాతగా మారిన మ్యాంగో అధినేత!

Singer Sunitha: టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సునీత రెండవ వివాహం తర్వాత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఒకవైపు వృత్తిపరమైన జీవితాన్ని మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని ఎంతో బ్యాలెన్స్ చేస్తూ కెరియర్లో ముందుకు పోతున్న సునీత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇదిలా ఉండగా తాజాగా సునీత తన కొడుకు విషయంలో సరికొత్త ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

సునీత కొడుకు ఆకాశ్ ను హీరోగా త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని సునీత ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ సినిమాని తన భర్త వీరపనేని నిర్మిస్తున్నారని త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను, సాంకేతిక నిపుణులను, నటీనటుల గురించి వెల్లడించనున్నట్లు టాలీవుడ్ సమాచారం. ఇక సునీత మొదటి భర్తకు కుమారుడు, కూతురు అనే విషయం మనకు తెలిసిందే.

సునీత కూతురు తన బాటలోనే సింగర్ గా తన కెరీర్ ను ప్రారంభించగా కొడుకు మాత్రం హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఆకాష్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆకాష్ ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకుంటున్నారని త్వరలోనే హీరోగా మన ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. మరి హీరోగా ఆకాష్ ఏవిధంగా ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.