Singer Sunitha: టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత గురించి మనందరికీ తెలిసిందే. సింగర్ సునీత పెద్దగా వివాదాల జోలికి పోదు. తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. సునీత చిన్నప్పుడే పెళ్లి చేసుకునే ఆ తర్వాత కొన్నాళ్లకు తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఇక ఇటీవలే బిజినెస్ మాన్ రామ్ వీరపనేని అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రామ్ తో కలసి వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది సునీత. ఇదిలా ఉంటే తాజాగా సునీత భర్త వివాదంలో చిక్కుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ వీరపనేని ఆధ్వర్యంలో మ్యాంగో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న విషయం అందరికి తెలిసిందే.
ఇందులో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, సాంగ్స్ తో ఈ మ్యాంగో యూట్యూబ్ ఛానల్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ఛానల్ లో పోస్ట్ చేసిన కొన్ని వీడియోలలో గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారు అంటూ గౌడ కుల సంఘాలు ధ్వజమెత్తాయి. ఈ నేపథ్యంలోనే మ్యాంగో యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ వారిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ వీడియోలో వెంటనే డిలీట్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గౌడ కుల సంఘాలు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ విషయంపై సింగర్ సునీత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.
ఇకపోతే సింగర్ సునీత తన మధురమైన గొంతుతో ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులను అలరించింది. ఇక టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. కేవలం సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత సునీత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈమె ఎక్కువగా నేచర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది.